రాయలసీమను రతనాల సీమ చేస్తానని… స్వయంగా కేసీఆర్… రోజా ఇంట్లో ఆతిధ్యం స్వీకరించి వ్యాఖ్యానించి.. ఇంకా వారం రోజులు కూడా గడవలేదు. కానీ.., ఎగువ నుంచి వెల్లువలా వస్తున్న వరదను… పోతిరెడ్డిపాడు ద్వారా.. రాయలసీమకు తీసుకువెళ్తూంటే మాత్రం… అభ్యంతరం చెబుతున్నారు. ఈ మేరకు తెలంగాణ సర్కార్ కృష్ణా రివర్ బోర్డుకు అధికారికంగా ఫిర్యాదు చేసింది. పోతిరెడ్డిపాడు ప్రాజెక్ట్ నుంచి అధికంగా నీటిని తరలిస్తున్నారని.. అడ్డుకోవాలని కోరింది. అలా తరలిస్తున్న నీరు లెక్కల్లోనూ ఏపీ అధికారులు.. తప్పుడు గణాంకాలు నమోదు చేస్తున్నారని తెలంగాణ సర్కార్ ఆరోపిస్తోంది. ఏపీ సర్కార్ ఇప్పటికి పది టీఎంసీలకుపైగా నీటిని తరలించినా.. రికార్డుల్లో మాత్రం.. ఏడు టీఎంసీలే చూపిస్తున్నారని తెలంగాణ వాదిస్తోంది.
నిజానికి శ్రీశైలం ప్రాజెక్టు నీటి మట్టం 840 అడుగులకు చేరగానే.. పోతిరెడ్డి పాడు ద్వారా.. రాయలసీమకు నీటిని తరలించే అవకాశం ఉంది. ముచ్చుమర్రి ఇతర ప్రాజెక్టుల ద్వారా.. సీమలో వర్షాలు లేకపోయినా.. గత సర్కార్ నీటి కొరత లేకుండా చూసుకుంది. అయితే.. ఈ సారి … 870 అడుగుల వరకూ.. శ్రీశైలం ప్రాజెక్ట్ లో నీటి నిల్వ వచ్చే వరకూ.. ఏపీ సర్కార్ .. పోతిరెడ్డిపాడును ఆన్ చేయలేదు. ఆ తర్వాత ప్రాజెక్ట్ నుంచి కిందకు నీళ్లు వదలక తప్పని పరిస్థితి ఏర్పడినప్పుడు మాత్రమే… పోతిరెడ్డి పాడు ఆన్ చేశారు. నాలుగైదు రోజులు ఆలస్యం కావడంతో… ఆ మేరకు.. రైతులకు నీళ్లు ఆలస్యం కానున్నాయి. అదే సమయంలో.. వరద పట్టనంతగా వస్తోంది. పోతిరెడ్డిపాడు నుంచి ఎంత ఎక్కువ తరలించినా… తెలంగాణకు నష్టం ఏమీ ఉండదు. అయినా… ఏపీ పై.. తెలంగాణ ఫిర్యాదు చేసి… కలకలం రేపుతోంది.
మిగులు జలాలపై .. సంపూర్ణ హక్కులు దిగువ రాష్ట్రాలకే ఉంటాయి. అయితే.. ఈ విషయంలో.. వరద తగ్గిపోయిన తర్వాత ప్రాజెక్టుల్లో ఉన్న నీటి వాటా అత్యధికంగా పొందడానికి… తెలంగాణ సర్కార్ ఈ తరహా ఫిర్యాదులు చేస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రాజెక్టుల్లో ఉన్న నీటిని.. తర్వాత కృష్ణా రివర్ బోర్డు పంపిణీ చేస్తుంది. ఆ సమయంలో.. పోతిరెడ్డి పాడు నుంచి… పెద్ద ఎత్తున నీటిని తరలించారు కాబట్టి… ఆ మేరకు.. తమకు ప్రాజెక్టుల్లో నీటిని కేటాయించాలని తెలంగాణ సర్కార్ కోరుతుంది. కానీ.. ఇప్పుడు.. పోతిరెడ్డి పాడు నుంచి తరలిస్తున్న మిగులు జలాలే…!. తెలంగాణతో స్నేహపూర్వకంగా ఉంటున్నామని చెప్పుకుంటున్న.. ఏపీ సర్కార్.. ఇలాంటి సున్నితమైన విషయాల్లో రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి ఏం చేస్తుందో చూడాలి.. !