అమెరికా పర్యటనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసహనానికి గురయ్యారు. డల్లాస్లో.. ఆయన వచ్చిన సందర్భంగా.. ఏర్పాటు చేసిన ఈవెంట్లో… ఖాళీ కుర్చీలే.. అత్యధికంగా కనిపించడం.. వచ్చిన కొద్ది మందే… లేని పోని హడావుడి చేసి.. తన దృష్టిలో పడేందుకు ప్రయత్నించడంతో.. వైసీపీ అధినేతలో అసహనం కనిపించింది. నిర్వాహకులు, జగన్ కంటే ముందే అమరికాకు వెళ్లి డల్లాస్ సభ ఏర్పాట్లను చూస్తున్న వైసీపీ నేతలపై.. ఆయన చిరాకుపడ్డారు.
కన్వెన్షన్ సెంటర్లో నిండింది 30 శాతం..!
అమెరికాలో వైఎస్ జగన్మోహన్ వ్యక్తిగత పర్యటనకు వెళ్లినప్పటికి… అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు… ఓ భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు. డల్లాస్లోని కే బెయిలి హచిసన్ కన్వెన్షన్ సెంటర్లో… ఈ వేడుకను.. ఏర్పాటు చేశారు. దీనికి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యేలా… ఎన్నారై వైసీపీ విభాగం ఒప్పించింది. కన్వెన్షన్ మొత్తాన్ని… ఆంధ్రులతో నింపేస్తామని మాటిచ్చారు. దాంతో.. జగన్మోహన్ రెడ్డి అంగీకరించారు. యూఎస్ పర్యనటకు బయలుదేరే ముందే.. మేడపాటి వెంకట్ రెడ్డి అనే వ్యక్తి … ఎన్నారై వ్యవహారాల సలహాదారుగా పదవి కూడా ఇచ్చారు. దాంతో.. డల్లాలో ఉన్న తెలుగువారంతా.. పెద్ద ఎత్తున తరలి వస్తారని అనుకున్నారు. కానీ… డల్లాస్ కన్వెన్షన్ సెంటర్లో కనీసం 30 శాతం కూడా నిండలేదు.
ఫ్రీ ఈవెంట్ అయినా తెలుగువారిని రప్పించలేకపోయిన ఆర్గనైజర్లు..!
డల్లాస్లోని కే బెయిలి హచిసన్ కన్వెన్షన్ సెంటర్ కెపాసిటీ.. పది నుంచి పన్నెడు వేల వరకూ ఉంటుంది. ఈ స్టేడియాన్ని ఫుల్ చేస్తామని.. ఎక్కడా ఖాళీ లేకుండా.. భారీ జనసందోహం కనిపించేలా చేస్తామని.. వైసీపీ అగ్రనేతలకు.. ఆర్గనైజర్లు హామీ ఇచ్చారు. దాని ప్రకారం.. వారూ .. తమ వంతు ప్రయత్నాలు చేశారు. ఫ్రీ ఈవెంట్ గా ప్రకటించారు. పార్కింగ్, భోజనం సహా.. దేనికీ చార్జ్ చేయలేదు. దాదాపుగా.. భారతీయ రూపాయల్లో.. ఈవెంట్ కోసం.. రూ. నాలుగైదు కోట్ల రూపాయలు ఖర్చయినప్పటికి వెనుకడుగు వేయలేదు. అమెరికా వ్యాప్తంగా చదువుకుంటున్న విద్యార్థులకూ.. ఆహ్వానాలు పంపారు. ఎంత చేసినా… ఈవెంట్కు.. వచ్చిన వాళ్లు… 3600 మాత్రమే.
నిర్వాహకులపై జగన్ అసహనం..!
కన్వెన్షన్ సెంటర్లో… పై స్టాండ్స్ మొత్తం ఖాళీగా ఉన్నాయి. కింది స్టాండ్స్ కొన్ని మాత్రం ఫిల్ అయ్యాయి. వచ్చిన వారంతా.. సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు సెల్ఫీలు దిగేందుకు ప్రయత్నించారు. అసలే అంతంతమాత్రం.. స్పందన ఉండటం.. వచ్చిన వారూ ఓవరాక్షన్ చేయడంతో.. జగన్మోహన్ రెడ్డి అసహనానికి గురయ్యారు. పూలదండ వేద్దామని తీసుకొచ్చిన కొంత మందిని కసురుకుని పంపేశారు. అమెరికా పర్యటనలో.. డల్లా స్ సభను భారీ జన సందోహంతో నింపుతామని .. జగన్ కు హామీ ఇచ్చిన ఆర్గనైజర్లు… కొన్ని హోర్డింగులు… ఇతర ప్రచారంతో సరిపెట్టారని.. మొబిలైజ్ చేసే ప్రయత్నం చేయలేదనే విమర్శలు వస్తున్నాయి.
Another video shows the poor attendance at Y.S. Jagan meeting at Dallas.
Top level stands , which are major portion of the Arena capacity , are vacant #JaganinUSA https://t.co/GkLWCZVJJX pic.twitter.com/sDk26bflaR
— Telugu360 (@Telugu360) August 18, 2019