కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డికి.. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలపై పోరాడటానికి ఓ గొప్ప అస్త్రం లభించింది. అదే.. యురేనియం. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. దీని వల్ల అనేక నష్టాలున్నాయని రేవంత్ రెడ్డి ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. యురేనియం తవ్వకాల వల్ల రెండు మండలాల్లోని సుమారు అరవై వేలమంది రోడ్డున పడతారని రేవంత్ .. ఉద్యమం ప్రారంభించారు. అరుదైన చెంచు జాతి అంతరించే ప్రమాదం ఉందని … అతిపెద్ద టైగర్ జోన్ ప్రాంతంగా నల్లమలో తవ్వకాలు జరిపితే పులులు అంతరించే ప్రమాదం సైతం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇన్ని నష్టాలున్న విషయాన్ని పరిగణలోకి తీసుకుని అక్కడ యురేనియం తవ్వకాల నిర్ణయాన్ని ఉపసహరించుకోవాలని రేవంత్ అంటున్నరా.
రేవంత్ రెడ్డి పదునైన మాటలతో ఇప్పటికే ఉద్యమాన్ని ప్రారంభించారు. యురేనియాన్ని తవ్వాలని చూస్తే.. గుండెల్లో గునపం దింపుతామంటూ… హెచ్చరికలు కూడా.. ఇప్పటికే జారీ చేశారు కాంగ్రెస్ యురేనియం తరవ్వకాలను వ్యతిరేకిస్తూ నల్లమల గ్రామాల్లో ఆందోళను చేస్తోంది. ప్రజాపోరాటాల్లో … ప్రజలను భాగస్వామ్యం చేసే దిశగా.. ఇప్పటి వరకూ.. కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. నేతలు వెళ్లిపోవడం… ఉన్న వారు లైట్ తీసుకోవడం వంటి కారణాల వల్ల.. ఇప్పటి వరకూ.. పెద్దగా.. ప్రజాపోరాటాలు చేయలేకపోయారు. కానీ.. ఇప్పుడు.. మాత్రం.. యురేనియం అంశం… ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత తెస్తుందని.. దాన్ని ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది.
రేవంత్ ఈ విషయం… అటు టీఆర్ఎస్ను.. ఇటు బీజేపీని తీవ్ర స్థాయిలో… టార్గెట్ చేస్తున్నరు. బీజేపీ.. ఈ విషయంలో.. ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం చేసే అవకాశం లేదు. కేంద్రమే.. పర్మిషన్ ఇచ్చింది. టీఆర్ఎస్ సర్కార్ కూడా… వ్యతిరేకించలేదు. ఎందుకంటే..ప్రభుత్వమే ఎన్వోసీ కూడా ఇచ్చింది. ఇదే రేవంత్ అడ్వాంటేజ్ అవుతోంది. రేవంత్ ఎంత పెద్ద స్థాయిలో ఉద్యమాన్ని రేపుతారో… ఆయన పొలిటికల్ లక్ష్యాన్ని అందుకోవడం.. అంత తేలికవుతుంది.