భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో .. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ పై… తనదైన మార్క్ రాజకీయం ప్రారంభించింది. జగన్ కు హిందూ విశ్వాసాల పట్ల నమ్మకం లేదని చెబుతూ..అమెరికాలో.. జగన్మోహన్ రెడ్డి … కార్యక్రమ ఆరంభ సూచికగా…జ్యోతి ప్రజ్వలనం చేయడానికి నిరాకరించడాన్ని ప్రస్తావిస్తోంది. ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముఖ్యనేతలంతరూ.. మంగళవారం ఇదే వీడియోను.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. జగన్ క్రిస్టియానిటీ నేపధ్యాన్ని బీజేపీ ఇలా ఉపయోగించుకుంటూడటంతో.. ఆ పార్టీ నేతలకు.. ఎలా స్పందించాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. నేరుగా బీజేపీని విమర్శించలేరు. ఆ లైసెన్స్ ఇంకా.. వైసీపీ నేతలకు రాలేదు.
భారతీయ జనతా పార్టీ నేతలు… ఏ అంశంపై విమర్శలు చేసినప్పటికీ.. కనీసం… మాటకు మాట చెప్పే.. పరిస్థితి కూడా ఇంత వరకూ లేదు. బీజేపీ తుగ్లక్ అన్నా… హిందూ సంప్రదాయాలను జగన్ అవమానిస్తున్నారని.. సోషల్ మీడియాలో ప్రచారం చేసినా… ఖండించలేని దుస్థితి. ఆ ఫ్రస్ట్రేషన్… వైసీపీ నేతల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఎలాగూ..కొంత మంది.. టీడీపీ నేతలు.. బీజేపీలో చేరారు కాబట్టి… వారిని అడ్డం పెట్టుకుని బీజేపీని విమర్శించి..సంతృప్తి పడదామని .. వైసీపీ నేతలు ఫిక్సయ్యారు. అదీ కూడా.. అందరికీ.. హైకమాండ్ నుంచి పర్మిషన్ రాలేదు. ఒక్క అంబటి రాంబాబుకు మాత్రమే.. ఈ విషయంలో.. చాన్సిచ్చారు. దాంతో ఆయన మీడియా సమావేశం పెట్టి తనదైన శైలిలో చెలరేగిపోయారు.
వాస్తవాలు తెలుసుకోకుండా అసత్యాలు మాట్లాడ్డం నేరమని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. అమెరికాలో డల్లాస్ కన్వెన్షన్ సెంటర్లో ఎలక్ట్రానిక్ పరికరం ద్వారా జ్యోతిని వెలిగిస్తారని…జగన్ అలాగే వెలిగించారని.. కవర్ చేశారు. దీన్ని ఆయన బీజేపీ నేతలకు అన్వయిస్తే.. అంబటి చెప్పిన నేరం ఎవరో చేశారో… తేల్చేస్తారని అనుకున్నారేమోకానీ… ముఖ్యమైన బీజేపీ నేతల మీద మాత్రం.. ఆ మరక పడకుండా తనే కవర్ చేశారు. కమల వనంలో చేరిన పచ్చ పుష్పాలు ఈ పని చేశాయని..మిగతా వారంతా మంచోళ్లన్నట్లుగా అంబటి చెప్పుకొచ్చారు.