కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంను సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని ఆయన ఇంటి వద్ద.. అత్యంత హైడ్రామా మధ్య.. చిదంబరాన్ని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఇందు కోసం..సీబీఐ అధికారులు ఆయన ఇంటి గోడలు దూకారు. తలుపులు బద్దలు కొట్టినంత పని చేశారు. ఇరవై నాలుగు గంటలుగా చిదంబరం ఆజ్ఞాతంలో ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే.. ఆయన హఠాత్తుగా… కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ కార్యాలయంలో.. చిదంబరం ఉన్న విషయం తెలియగానే.. సీబీఐ, ఈడీ అధికారులు హుటాహుటిన అక్కడుకు చేరుకున్నారు. అయితే.. చిదంబరం… ప్రెస్ మీట్ ముగించుకుని ఇంటికి వెళ్లిపోయారు.
కాంగ్రెస్ కార్యాలయం దగ్గర… కార్యకర్తలు సీబీఐ అధికారుల్ని అడ్డుకోవడంతో… వారు.. చిదంబరాన్ని పట్టుకోలేకపోయారు. ఆ తర్వాత సీబీఐ అధికారులు… చిదంబరం ఇంటికి వెళ్లారు. సీబీఐ, ఈడీ అధికారులు ఎంతగా.. తలుపులు కొట్టినప్పటికీ.. ఎవరూ గేట్లు తీయలేదు. దాంతో.. గోడ దూకి.. సీబీఐ, ఈడీ అధికారులు లోపలికి వెళ్లారు. కాసేపటికి ఈడీ అధికారులు వెళ్లిపోయినప్పటికీ.. అరెస్ట్ బాధ్యతను సీబీఐ అధికారులు తీసుకున్నారు. ఎంత సేపటికి చిదంబరం ఇంట్లోకి అధికారులు అనుమతించలేదు. చివరికి ఢిల్లీ పోలీసుల సాయం తీసుకుని.. అదులుకి తీసుకున్నారు. చిదంబరం ఇంటికి చేరినప్పటి నుంచి చిదంబరం ఇంటి వద్ద.. పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు గుమికూడారు. కాంగ్రెస్ సీనియర్ నేతలంతా… ఆయన ఇంటి వద్దకు తరలి వచ్చారు.
శుక్రవారం.. సుప్రీంకోర్టులో… బెయిల్ పిటిషన్ పై విచారణ ఉంటే.. హుటాహుటిన అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని కాంగ్రెస్ నేతలు సీబీఐపై మండిపడ్డారు. కాంగ్రెస్ ఆఫీసులో మీడియాతో మాట్లాడిన చిదంబరం.. . ఐఎన్ఎక్స్ మీడియా కేసులో… తన పేరు ఎక్కడా లేదని.. తనపై ఎలాంటి ఆరోపణలు లేవని.. అయినప్పటికీ.. కుట్ర పన్ని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన ముందస్తు బెయిల్ పిటిషన్ పై… శుక్రవారం సుప్రీంకోర్టు విచారణ జరుపుతుందని.. అప్పటి వరకూ.. తనకు స్వేచ్చ ఉంటుందన్నారు. అయితే… సీబీఐ, ఈడీ… మాత్రం… చిదంబరానికి శుక్రవారం వరకూ సమయం ఇవ్వాలని అనుకోలేదు. అరెస్ట్ చేశారు.