అమరావతిలో ఏపీ ప్రభుత్వ నిర్ణయాలను… పిచ్చితుగ్లక్ నిర్ణయాలుగా… ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు అభివర్ణిస్తున్నారు. అలా అంటున్న సమయంలోనే.. విజయసాయిరెడ్డి ఢిల్లీలో.. ఆ నిర్ణయాలన్నింటికీ.. ప్రధానమంత్రి మోడీ, హోంమంత్రి అమిత్ షాలకు…చెప్పే చేస్తున్నామని ప్రకటించారు. దీంతో.. ఒక్క సారిగా కలకలం రేగింది. అసలేం జరుగుతుందో.. బీజేపీ నేతలకూ అర్థం కావడం లేదు. కానీ.. విజయసాయిరెడ్డి.. తన మార్క్ రాజకీయ ఆడిటింగ్ తెలివి తేటలను.. మోడీ, షాలపై ప్రయోగిస్తున్నారని మాత్రం.. చాలా మందికి క్లారిటీ వచ్చేసింది.
ఏపీలో జరిగే తప్పులన్నింటికీ మోడీ, షాలపై బాధ్యత నెట్టేస్తున్నారా..?
” సార్.. పీపీఏల్లో అవినీతి జరిగింది. కచ్చితంగా చర్యలు తీసుకోవాలి. కాంట్రాక్టుల్లో అవినీతి జరిగింది. పర్సంటేజీలు తీసుకున్నారు. రద్దు చేయాలి… గత ప్రభుత్వం హయాంలో.. అవినీతి జరిగింది వెలికి తీయాలి..!..” ఇది జగన్ అయినా.. విజయసాయిరెడ్డి అయినా.. మోడీని లేదా.. అమిత్ షాను కలిసినప్పుడు చెప్పే మాటలు. అవినీతి జరిగితే కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనని… అటు మోడీ అయినా.. ఇటు అమిత్ షా అయినా… చెబుతారు. ఇలా చెప్పిన మాటల్నే అడ్వాంటేజ్ గా తీసుకుని… జగన్, విజయసాయిరెడ్డి.. బీజేపీని ఇరికించేస్తున్నారన్న ఢిల్లీలో జోరుగా చర్చ జరుగుతోంది. అవినీతిపై ఆధారాలు లేకుండా.. తమ అస్మదీయులకు కాంట్రాక్టులు.. ఇతర లాభాలను కల్పించేందుకు.. నేరుగా.. మోడీ, షా పేర్లను.. విజయసాయిరెడ్డి, జగన్ వాడేసుకుంటున్న వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది.
ఏ ప్రధాని అయినా తమను లెక్క చేయవద్దని చెబుతారా..?
అటు కేంద్రం కానీ..పార్టీ పరంగా ఇటు బీజేపీ కానీ.. వైసీపీ నిర్ణయాలను సమర్థించడం లేదు. అయినా ఏపీ సర్కార్… దూకుడుగానే ఉంది. కేంద్రాన్ని లెక్కలోకి తీసుకోనట్లుగా నిర్ణయాలు ప్రకటిస్తూనే ఉంది. ఏపీలో కొత్త సర్కార్ ఏర్పడిన రెండున్నర నెలల కాలంలో.. అత్యంత వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆర్థిక వ్యవస్థపైనే కాదు… పెట్టుబడుల వాతావరణంపై..ప్రభావం పడే నిర్ణయాలు తీసుకున్నారు. వీటిని కేంద్రం కూడా ప్రశ్నించింది. తాము ప్రతి నిర్ణయాన్ని… ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలకు చెబుతున్నామని.. వారి అంగీకారం మేరకే.. పీపీఏల రద్దు, పోలవరం రివర్స్ టెండర్లపై ముందుకెళ్తున్నామని… విజయసాయిరెడ్డి నేరుగా ప్రకటించారు. తమ నిర్ణయాల ప్రభావం… పరిణామాలు కేంద్రానికి అంటించే ప్రయత్నం చేశారు. దీనికి తన రాజకీయ తెలివితేటల్ని… జగన్, విజయసాయి బాగానే వాడుతున్నారనే అభిప్రాయం ఏర్పడుతోంది.
బీజేపీని దారుణంగా దెబ్బకొట్టే వ్యూహం విజయసాయి అమలు చేస్తున్నారా..?
వివాదాస్పద నిర్ణయాలన్నింటికీ.. మోదీ, షా పర్మిషన్ ఉందని చెప్పడం ద్వారా.. విజయసాయిరెడ్డి… బీజేపీ అగ్రనేతలతో తనకు ఉన్న సాన్నిహిత్యాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే… నిజంగా వారు పర్మిషన్ ఇచ్చి ఉంటే.. కేంద్రం నుంచి ఎట్టి పరిస్థితుల్లో హెచ్చరికలతో కూడిన లేఖలు వచ్చి ఉండేవే కావు. కానీ విజయసాయిరెడ్డి మాత్రం.. ఆ నిర్ణయాలన్ని .. మోదీ, షాల చలువేనన్నట్లుగా.. ప్రచారం ప్రారంభించేసారు. దేశంలో పెట్టుబడుల వాతావరణం దెబ్బతినకూడదని… కేంద్రం పట్టుదలతో ఉంది. ఇలాంటి సమయంలో.. పీపీఏల సమీక్షకు.. పోలవరం రివర్స్ టెండర్లకు.. మోదీ , షా అనుమతి ఇచ్చే అవకాశం లేదని బీజేపీ వర్గాలు కూడా చెబుతున్నాయి. అయితే.. విజయసాయిరెడ్డి మాత్రం అడ్వాంటేజ్ తీసుకున్నారు. ప్రస్తుత పరిణామాలన్నీ చూస్తే… రాజకీయ అడ్వాంటేజ్ ను ఆశగా చూపి.. బీజేపీని వైసీపీ బద్నాం చేసేప్రయత్నం చేస్తోందన్న అంచనాలు రాజకీయాల్లో వస్తున్నాయి. ప్రత్యేకహోదా అంశాన్ని జగన్ పదే పదే ప్రస్తావించడానికి .. ప్రజల్లో వ్యతిరేకత తెచ్చి పెడుతున్న పోలవరం, అమరావతి, పీపీఏల విషయంలోనూ.. బీజేపీకి లింక్ పెడుతున్నదీ అందుకేననే చర్చ ప్రారంభమయింది.