నేను ఉన్నాను… నేను విన్నాను..! అంటూ… జగన్మోహన్ రెడ్డి మీడియా… సాక్షి.. ఎన్నికల సమయంలో ఎంత హడావుడి చేసిందో… ప్రజలందరికీ ఇంకా గుర్తుంది. అయితే.. ఎన్నికలు పూర్తయి.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరవాత… జగన్ మీడియాకు.. ఏమీ వినిపించడం లేదు. ఏమీ కనిపించడం లేదు. అవసరమైన చోట మాత్రం.. కాస్త తేడాగా వినిపించుకుని.. కల్పించుకుని రాస్తోంది. ఆ వెసులుబాటు లేని చోట… అసలు వార్తకే జెల్ల కొడుతోంది. ప్రస్తుతం.. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో… హైకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు విషయంలో… సాక్షి పత్రిక.. ఇదే పద్దతిని పాటించింది. కేవలం నాలుగంటే..నాలుగు లైన్లు.. అదీ కూడా.. పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించినదని ఎక్కడా చెప్పకుండా.. హైకోర్టు తీర్పు వార్త రాసేసి.. తమకు అసలు మనస్సాక్షి లేదని… దాన్ని ఎప్పుడో చంపేసుకున్నామని నిరూపించుకున్నారు.
పోలవరం రివర్స్ టెండర్లను.. నిలిపి వేస్తూ.. హైకోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పులో ఎన్నో కీలక వ్యాఖ్యలు చేసింది. ఒప్పందాలను.. ప్రభుత్వం ఏకపక్షంగా ఉల్లంఘిస్తూ.. రద్దు చేయడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పవర్ ప్రాజెక్ట్ విషయంలో… అసలు ఏపీ సర్కార్ ఏ అధికారంతో.. కాంట్రాక్టును టెర్మినెట్ చేసిందని ప్రశ్నించింది. ఓ రకంగా.. ఏపీ సర్కార్.. మొండి వాదనకు.. దందుడుకు నిర్ణయాలకు… హైకోర్టు తీర్పు గట్టిగానే షాక్ లా తగిలింది. దీనిపై.. తమ వాదన వినిపించుకునే అవకాశం కూడా సాక్షికి దొరకలేదు. అందుకే.. ఓ చిన్న కాలమ్ ఆర్టికల్‌తో సరిపెట్టారు.
నిజానికి సాక్షి మీడియాది ఓ ప్రత్యేక శైలి. తమకు ఏది కావాలో… అది ఊహించేసుకుని రాసుకుంటుంది. కొన్నాళ్ల కిందట.. పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ సమావేశం జరిగింది. ఆ సమయంలో… రివర్స్ టెండర్లు వద్దని పీపీఏ స్పష్టంగా చెప్పింది. అయితే సాక్షి మాత్రం.. పీపీఏ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తమ పత్రికకలో రాసుకున్నారు. ఇప్పుడు.. హైకోర్టు తీర్పు విషయంలో.. అలాంటి వెసులుబాటు.. సాక్షి మీడియా తీసుకోలేకపోయింది. అలా తీసుకుని ఉంటే.. కోర్టు ధిక్కరణ అవుతుందని భయపడ్డారేమో కానీ.. చిన్న వార్తతో సరిపెట్టారు. అందులోనూ.. ఎన్నో నిజాలు దాచి పెట్టారు.