రాజకీయాల్లో అధికార పార్టీ నేతలు … ప్రభుత్వ పరంగా తీసుకునే నిర్ణయాలు నచ్చకపోతే తుగ్లక్ పరిపాలన చేస్తున్నారనే విమర్శలు సహజంగానే వస్తూ ఉంటాయి. ఇప్పుడు.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాల విషయంలో.. విమర్శించడానికి…అందరికీ ముందుగా.. ఈ తుగ్లక్కే కనిపిస్తున్నారు. పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్లు, పోలవరం రివర్స్ టెండర్లు, రద్దులు… లాంటి నిర్ణయాలు మాత్రమే కాకుండా.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి… రాజధానిని కూడా మార్చే ఆలోచన చేస్తున్నారన్న ప్రచారం జరగడంతో.. ఈ తుగ్లక్ అనే పదానికి.. కాస్త సార్థకత వచ్చినట్లుగా.. ఏపీ విపక్ష నేతలు.. మరింతగా.. ఉపయోగించుకుంటున్నారు. టీడీపీ బీజేపీ నేతలు అదే పని చేస్తున్నారు.
ఆ తుగ్లక్ కూడా రాజధాని మార్చాడా…?
మహ్మద్ బిన్ తుగ్లక్ తుగ్లక్ భారత ద్వీపకల్పంలోని పలు ప్రాంతాలను పరిపాలించిన రాజు. దక్షిణ ప్రాంతాలపై పట్టు కొరకు తన రాజధానిని ఢిల్లీ నుండి దేవగిరి కి మార్చాడు. దాని పేరును దౌలతాబాద్‌గా మార్చారు. తన ప్రభుత్వకార్యాలయాను మాత్రమే కాకుండా.. మొత్తం ప్రజానీకాన్ని దౌలతాబాద్‌కు మారాలని హుకుం జారీ చేశారు. అయితే.. తాను ప్రకటించిన కొత్త రాజధానిలో… కనీస సౌకర్యాలు ప్రజల కోసం కల్పించలేకపోయాడు. రెండేళ్లలో తిరిగి రాజధానిగా ఢిల్లీగా మార్చి.. ప్రజలందర్నీ మళ్లీ ఢిల్లీకి వెళ్లాలని ఆదేశాలు జారీ చేశాడు. ఈ అసంబద్ధ నిర్ణయాలకు… ఎంతో మంది సామాన్య జనం మరణించారు. అందుకే.. అసంబద్ధమైన నిర్ణయాలు తీసుకున్న పాలకులను… ఇతర నేతలు… తుగ్లక్‌తో పోల్చి విమర్శలు చేస్తూ ఉంటారు.
దొనకొండ దౌలతాబాద్ అవుతుందా..?
ఆంధ్రప్రదేశ్ సర్కార్… రాజధానిని దొనకొండ ప్రాంతానికి మార్చాలనుకుంటోందన్న ప్రచారం ఉధృతంగా సాగుతోంది. దీనికి సంబంధించి ప్రభుత్వంలో చర్చలు కూడా జరుగుతున్నాయని.. సాక్షాత్తూ పురపాలక శాఖ మంత్రే ప్రకటించారు. ఆ తర్వాత ఎవరు.. ఖండించినా… అనుమానం మాత్రం అలాగే ఉండిపోతుంది. ఎందుకంటే… సర్వాధికారులు ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి.. అమరావతిపై ఏ మాత్రం సానుకూలంగా లేరు. ఆయన నోటి వెంట.. ఇంత వరకూ అమరావతి అనేమాట రాలేదు. అమరావతిలో ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ ఉద్ధృతంగా సాగిన పనులు.. ఒక్కసారిగా ఆగిపోవడం వెనుకా తరలింపు వ్యూహం ఉందని.. సహజంగానే అనుమానం వస్తుంది. అదే నిజం అయితే.. దొనకొండకు.. రాజధాని మార్చితే… ఢిల్లీ నుంచి దౌలతాబాద్‌కు రాజధాని మారినప్పుడు.. ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడాలో..అన్నీ పడతారనే అంచనాలున్నాయి.
తుగ్లక్ గత చరిత్రతో జగన్‌కూ పోలికలున్నాయా..?
తుగ్లక్.. తన తండ్రిని చంపించడానికి.. కుట్ర పన్నారని.. చరిత్ర చెబుతోంది. వైఎస్ మృతి వెనుక జగన్ హస్తం ఉందని… ప్రస్తుతం వైసీపీ సర్కార్ లో మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ లాంటి వాళ్లు ఆరోపణలు చేశారు. ఇవేమీ నిజం కాకపోయినప్పటికీ.. ఆరోపణలు మాత్రమే. అయితే.. సారూప్యం ఉండటమే విషయం. మామూలుగా అయితే.. ఇదేమీ పెద్ద విషయం అయ్యేది కాదు కానీ.. తుగ్లక్ లాగే.. రాజధానిని మార్చే ఆలోచనలో ప్రభుత్వం ఉండబట్టే… ఈ విమర్శలు హాట్ టాపిక్ అవుతున్నాయి. .. కానీ… ఆ తుగ్లక్‌కి.. ఈ జగన్‌కి సంబంధమే లేదు..!