గత వారంలో… విజయవాడలో పెద్ద సంఖ్యలో ఆవులు చనిపోతే.. తెలంగాణలోని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అక్కడ ప్రత్యక్షమయ్యారు. ఆయన మార్క్ ప్రకటనలు చేశారు.
నాలుగు రోజుల కిందట.. శ్రీశైలంలో అన్యమతస్తులు ఎక్కువైపోయారంటూ… జరిగిన రగడలో.. ప్రధానంగా వినిపించిన పేరు.. రాజాసింగ్. ఆయన అక్కడకు వెళ్లడానికి సిద్ధమయ్యారు కానీ.. రాజాసింగ్ హెచ్చరికలకు.. ప్రభుత్వం వెనక్కి తగ్గి.. ఈవ బదిలీ చేసి.. షాపుల వేలాన్ని నిలిపి వేయడంతో.. ఆగిపోయారు.
ఈ రోజు… తిరుపతిలో ప్రత్యక్షమయ్యారు తిరుమలకు వెళ్లే్ బస్సుల్లో టిక్కెట్లపై జెరూసలెం యాత్ర గురించి ముద్రిస్తున్నారంటూ.. ఆందోళన ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ అన్యమతం… అని వినిపించినా.. ఎక్కడ హిందూ సంప్రదాయాల ఉల్లంఘన అని..కనిపించినా.. రాజాసింగ్ ప్రత్యక్షమైపోతున్నారు. తిరుమల డిపోకు చెందిన ఆర్టీసీ బస్ టిక్కెట్ల వెనుక.. పవిత్ర జెరూసలెం యాత్రకు.. ఇబ్బంది లేకుండా వెళ్లండి.. అంటూ… ప్రకటనలు ముద్రించారు. తిరుపతి నుంచి తిరుమల వెళ్లే బస్సుల్లోనే ఇవి జారీ చేశారు. కొంత మంది భక్తులు దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఫిర్యాదు చేశారు. మరికొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దీంతో.. ఆర్టీసీ అధికారులు.. నాలిక్కరుచుకున్నారు. వెంటనే.. ప్రభుత్వానికేం సంబంధం లేదని.. తప్పును తమపై వేసుకునేందుకు ముందుకు వచ్చారు. తిరుమలకు వచ్చిన ఐదు ఖాళీ రోల్స్‌పై మాత్రమే అన్యమత ప్రకటనలు ఉన్నాయని కవర్ చేసుకున్నారు. గుర్తించిన తర్వాత వాటిని పక్కన పెట్టామంటున్నారు. కానీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలనుకుంటున్న వారికి అడ్డేముంటుంది.
నిజానికి తిరుమలలో ప్రైవేటు వ్యక్తులు అన్యమత ప్రచారం చేస్తే.. తీవ్ర చర్యలు ఉంటాయి. కానీ ఇప్పుడు.. నేరుగా ఓ ప్రభుత్వ సంస్థనే.. అధికారికంగా అన్యమత ప్రచారం చేసింది. దీనికి.. బాధ్యలెవరో కానీ.. ఇలాంటి.. ఆషామాషీగా జరిగే అవకాశం లేదని మాత్రం చెబుతున్నారు. వైఎస్ ఫ్యామిలీకి ఉన్న క్రిస్టియన్ నేపధ్యం.. వారెవరూ హిందూ విశ్వాసాలపై నమ్మకం పెట్టుకోకపోవడం.. రాజకీయ అవసరాల కోసం.. మత మార్పిడులకు ప్రొత్సహిస్తున్నారన్న ప్రచారం ఇప్పటికే ప్రారంభం కావడంతో.. ఈ టిక్కెట్ల వ్యవహారం.. రాజకీయ దుమారంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. దీన్ని బీజేపీ మ్యాగ్జిమం వాడుకోవడానికి రాజాసింగ్ ను ఉపయోగించుకుంటోంది.