వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమెరికాలో ఉన్న తొమ్మిది రోజుల్లో.. ఆయన ప్రమేయం లేకుండా చాలా జరిగిపోయాయి. అవన్నీ… జగన్మోహన్ రెడ్డికి కొత్త కొత్త సవాళ్లను తీసుకొచ్చాయి. ఆయన ఏపీలో లేని సమయంలో.. కీలక నేతలందరూ.. తలా ఓ సమస్య తెచ్చి పెట్టారు. చివరికి వాటిపై .. ఎలా స్పందించాలో తెలియక.. ఆయా నాయకులు కూడా.. సైలెంటయిపోయారు. జగన్మోహన్ రెడ్డి ఇండియాకు రాగానే.. వారు తెచ్చి పెట్టిన సమస్యలన్నింటినీ కవర్ చేయాల్సి ఉంది.
బీజేపీతో సన్నం తెచ్చి పెట్టిన విజయసాయిరెడ్డి..!
ఏపీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలన్నీ.. మోడీ, షాలకు చెప్పే తీసుకుంటున్నామని.. విజయసాయిరెడ్డి ప్రకటించడం… రాజకీయ సంచలనం అయింది. జగన్, విజసాయిరెడ్డి.. అధికారాన్ని అడ్డు పెట్టుకుని చేయాలనుకుంటున్న అక్రమాలకు.. మోడీ, షాలను వాడుకుంటున్నారన్న అభిప్రాయం బీజేపీలో ఏర్పడటంతో.. వారు.. ఓ స్థాయిలో ఫైరవువుతున్నాయి. ఈ విషయం.. బీజేపీ పెద్దల వద్దకూ చేరింది. విజయసాయి వ్యాఖ్యలు.. వాటి వెనుక ఉన్న అంతరార్థాలపై కూపీ లాగుతున్నారు. ఈ విషయం… మిస్ ఫైర్ అవడంతో… విజయసాయిరెడ్డి సైలెంటయిపోయారు. బీజేపీ నేతలు… ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేస్తున్నా.. కనీసం.. కవర్ చేసుకోవడానికి కూడా ధైర్యం చేయడం లేదు. జగన్ వచ్చి.. ఏదో విధంగా కవర్ చేస్తారని.. ఆయన ఆశతో ఉన్నారు.
రాజధానిపై సీక్రెట్ బయట పెట్టి .. చోద్యం చూస్తున్న బొత్స..!
వైఎస్ జగన్ ఇండియాలో లేని సమయంలో… పురపాలక మంత్రి బొత్స… రాజధానిని మార్చే ఉద్దేశం ఉందని చెప్పి.. ఓ రకంగా చిచ్చు పెట్టేశారు. దీంతో ఏపీలో గగ్గోలు రేగింది. దీన్ని ఎలా కవర్ చేసుకోవాలో… వైసీపీ నేతలకు అర్థం కావడం లేదు. మంత్రులందరూ.. ఇదే తరహా గందరగోళం సృష్టిస్తున్నారు. అమరావతిని మార్చే ఉద్దేశం లేదంటారు.. అక్కడ ముంపు ఉందంటారు. తలా ఓ ప్రకటన చేస్తున్న సమయంలో… అసలు మంట రాజేసిన.. బొత్స సత్యనారాయణ మాత్రం సైలెంటయిపోయారు. ఆయన మీడియా ముందుకు రావడం లేదు. తన మాటలపై ఎలాంటి వివరణ ఇవ్వడం లేదు. ఇంత రచ్చ జరుగుతున్నా… సైలెంటయిపోయారు. బొత్స సీనియర్ మంత్రి. రాజదాని మార్పుపై.. ప్రభుత్వంలో చర్చ జరుగుతోందని నేరుగా చెప్పిన తర్వాత ఖండించడానికి.. సీఎం స్థాయి వ్యక్తే రావాలి. ఇప్పుడు.. అమెరికా నుంచి వస్తున్న జగన్ నుంచి క్లారిటీ కోసమే.. వైసీపీ నేతలు కూడా ఎదురు చూస్తున్ారు.
రివర్స్ పై సమాధానం చెప్పుకోలేని స్థితికి తెచ్చిన హైకోర్టు తీర్పు..!
రివర్స్ టెండరింగ్ అంటే.. నీతికి సర్టిఫికెట్ అన్నట్లుగా కవరింగ్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి హైకోర్టు ఓ రకంగా షాక్ ఇచ్చింది. న్యాయసమీక్షల పేరుతో హడావుడి చేసినా.. ప్రయోజనం కలలేదు. హైకోర్టు తీర్పు రాగానే… అమెరికాలో ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీఎంకు సమాచారం పంపారు. దీంతో తదుపరి ఏం చేయాలన్నదానిపై న్యాయనిపుణులతో సంప్రదించాలని జగన్ సూచించారు. తాను వచ్చిన తర్వాత ఏం చేయాలో నిర్ణయం తీసుకుందామన్నారు. దీంతో.. ఇప్పుడు… పోలవరం చిక్కుముడిని ఎలా విప్పాలో కూడా.. తెలియక వైసీపీ నేతలు జగన్ కోసం ఎదురు చూస్తున్నారు.