పోలవరం ప్రాజెక్ట్ టెండర్లను ఎట్టి పరిస్థితుల్లో… రివర్స్ చేయాలనుకున్న ఏపీ సర్కార్ కు.. ఏదీ కలసిరావడం లేదు. నిన్న కోర్టు షాకివ్వగా.. ఈ రోజు పీపీఏ ఆ బాధ్యత తీసుకుంది. రివర్స్ టెండరింగ్ కు వద్దే వద్దని.. ప్రస్తుతం ఉన్న కాంట్రాక్టర్లతోనే పనులు కొనసాగించాలని సూచించింది. రివర్స్ టెండర్లు.. పోలవరం ప్రాజెక్ట్ ముందుకు సాగడానికి ఏ మాత్రం మంచి పరిణామం కాదని… పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ… కేంద్రానికి స్పష్టమైన నివేదిక ఇచ్చింది. మొత్తం ప్రస్తుతం.. పోలవరం ప్రాజెక్ట్ పరిస్థితి, ఏపీ సర్కార్ వ్యవహరిస్తున్నరు.. ప్రాజెక్ట్ ఆలస్యం కాకుండా ఉండాలంటే.. ఏం చేయాలన్న దానిపై.. మొత్తం పన్నెండు పేజీల నివేదిక… పీపీఏ చైర్మన్ ఆర్కే జైన్..కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖకు సమర్పించారు. నివేదిక మొత్తం.. పోలవరం రీ టెండరింగ్ వల్ల కలిగే నష్టాలను పీపీఏ వివరించింది.
రీటెండరింగ్ వల్ల ప్రాజెక్ట్ మరింత జాప్యం అవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రాజెక్ట్ వల్ల లభించే ప్రయోజనాలు కూడా ఆలస్యమవుతాయని తెలిపింది. పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యమైతే పట్టిసీమ, పురుషోత్తపట్నం భారం.. రాష్ట్ర ప్రభుత్వంపై అధికంగా ఉంటుందని తెలిపింది. ఇప్పటికే ప్రాజెక్ట్ నాలుగేళ్లు ఆలస్యమైందని… రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల న్యాయపరమైన ఇబ్బందులు కూడా వస్తాయని పీపీఏ నివేదికలో స్పష్టం చేసింది. ఏపీ సర్కార్ చెబుతున్నట్లుగా.. తక్కువ ధరకు కాంట్రాక్టర్ వస్తారన్న నమ్మకం కూడా లేదని.. పైగా ప్రాజెక్ట్ ఆలస్యమయ్యే కొద్దీ నిర్మాణ వ్యయం భారీగా పెరుగుతుందని నివేదికలో పీపీఏ తెలిపింది. ఒక వేళ తక్కువ ధరకు వచ్చే కాంట్రాక్టర్లు నాణ్యమైన పనులు చేస్తారన్న గ్యారంటీ లేదని.. స్పష్టం చేసింది. ప్రాజెక్ట్‌ను ప్రస్తుత కాంట్రాక్టర్ ద్వారానే యధాతథంగా కొనసాగించడం మంచిదని ఫైనల్‌గా.. తుది అభిప్రాయాన్ని పీపీఏ వెల్లడించి. ఏపీ సర్కార్‌కు కూడా.. నివేదిక కాపీని పీపీఏ పంపింది.
పీపీఏ నివేదిక ఆధారంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది కాబట్టి.. నవయుగనే పనులు కొనసాగించడం ఖాయమనిచెప్పుకోవచ్చు. అంతా మా ఇష్టం అంటున్న ఏపీ సర్కార్ పై కేంద్ర జలశక్తి మంత్రి ఓ రేంజ్ లో ఫైరయ్యారు. డబ్బులు చెల్లించేది కేంద్రమే కాబట్టి .. ఇష్టం వచ్చినట్లు చేస్తే కేంద్రం ఊరుకోదని హెచ్చరించారు. కేంద్రం ఆశీస్సులతోనే ఈ పనులన్నీ చేస్తున్నామంటున్న… విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై కేంద్రమంత్రి షెకావత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలన్నీ చూస్తే.. రివర్స్‌లో ఏపీ సర్కార్ కు రివర్స్ షాక్ తగిలినట్లే..!