ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఏపీ సర్కార్ పని చేయకపోతే.. ప్రతిపక్ష పాత్ర పోషించడానికి సిద్ధమని రామ్‌మాధవ్.. నేరుగా… హెచ్చరికలు పంపించారు. శ్రీవారి దర్శనం కోసం.. శుక్రవారం తిరుమల వచ్చిన ఆయన… శనివారం.. తిరుపతిలో.. బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఏపీలో అభివృద్ధి జరుగుతుందనుకుంటే.., విధ్వంసం జరుగుతోందని.. మండిపడ్డారు అభివృద్ధి కోరుకునే… ప్రజలు వైసీపీకి ఓటేశారని… గుర్తు చేశారు. గత ప్రభుత్వ తప్పులను సరిచేసేందుకు … సహకరిస్తామని.. కానీ.. ప్రజావ్యతిరేకత నిర్ణయాలు తీసుకుంటే మాత్రం… నేరుగా వచ్చి పోరాడటానికి కూడా సిద్ధమేనని స్పష్టం చేశారు.
ఇప్పటికే.. బీజేపీ నేతలు… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ పై.. ఓ రేంజ్లో ఫైరవుతున్నారు. ఒక్క మతం విషయంలోనే కాదు.. పాలన విషయంలో కూడా విమర్శలు చేస్తున్నారు. అయితే.. నేతల్ని బట్టి.. విమర్శల రేంజ్ మారుతోంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ.. అయితే.. తెలుగుదేశం పార్టీ నేతల స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఇక ఇన్చార్జ్.. సునీల్ ధియోధర్ లాంటి వాళ్లు కూడా.. తగ్గడం లేదు. మాజీ మంత్రి మాణిక్యాలరావు కూడా ఘాటు పెంచారు. సోమువీర్రాజు లాంటి కొంత మంది.. వైసీపీపై సాఫ్ట్ కార్నర్ ఉన్న వారు మాత్రమే… కాస్త సైలెంట్‌గా ఉంటున్నారు.
ఏపీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలపై కేంద్రం అసహనంతో ఉందన్నప్రచారం జరుగుతోంది. ఆ నిర్ణయాలపై కేంద్రం నుంచి వ్యతిరేకత వస్తున్నా… మోడీ, షాలకు చెప్పే చేస్తున్నామంటూ.. విజయసాయిరెడ్డి.. మొత్తం కేంద్రంపైకి నెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో రామ్ మాధవ్ విమర్శలు కీలకంగా మారాయి. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా.. ప్రతిపక్ష పాత్ర పోషిస్తామంటూ… రామ్ మాధవ్ చెప్పుకొస్తున్నారు. ఏం చేసినా చూస్తూ ఊరుకోబోమంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.