ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి… రాజకీయాల్లో కొంత మార్పు కనిపిస్తోంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరు పదే దే వివాదాస్పదమవుతోంది. గతంలో ఎప్పుడూ పెద్దగా ప్రచారంలోకి రాని మత మార్పిడుల అంశం… తెరపైకి వచ్చింది. గోవుల మృతి, శ్రీశైలం వివాదం, తిరుమల టిక్కెట్లపై జెరూసలెం యాత్ర.. కూడా అంతే.. చివరికి.. అమెరికా జగన్ జ్యోతి ప్రజ్వలనం చేయకపోవడం కూడా వివాదమే.
రోజుకో మత రాజకీయ నినాదం తెరపైకి తెస్తున్న బీజేపీ..!
ఏపీలో ఇప్పటి వరకూ కుల రాజకీయాలు కీలక పాత్ర పోషించాయి. ఇక నుంచి ఆ స్థానాన్ని మతం ఆక్రమించనుంది. బీజేపీ బలపడాలంటే.. అతి అత్యవసరం. అందుకే ఆ పార్టీ కూడా.. దీన్నే ఆసరాగా చేసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ అన్యమతం అని వినిపించినా.. ఎక్కడ హిందూ సంప్రదాయాల ఉల్లంఘన అని..కనిపించినా.. బీజేపీ నేతలు యాక్టివ్ అవుతున్నారు. వైఎస్ ఫ్యామిలీకి ఉన్న క్రిస్టియన్ నేపధ్యం బీజేపీకి అడ్వాంటేజ్ గా మారుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాజకీయ అవసరాల కోసం.. మత మార్పిడులకు ప్రొత్సహిస్తున్నారన్న ప్రచారం ఇప్పటికే ప్రారంభం కావడంతో.. ఒక్కొక్కటిగా హిందూ వ్యతిరేక వివాదాలు తెరపైకి వస్తున్నాయి. రాజకీయ దుమారంగా మారుతున్నాయి…
బీజేపీకి కౌంటర్ ఇవ్వలేకపోతున్న వైసీపీ..!
ఏపీలో ఉన్న రాజకీయ పరిస్థితులు భిన్నం. హిందూ రాజకీయాలు… అన్యమత ప్రచారాలపై… తెలుగుదేశం పార్టీ విమర్శలు ఓ స్థాయి వరకే ఉంటాయి. ఈ విషయంలో పేటెంట్ భారతీయ జనతా పార్టీకే ఉంటుంది. వారి దూకుడు… స్పష్టంగానే కనిపిస్తోంది. కానీ… ఆ పార్టీని వైసీపీ నేతలు ఏమీ అనలేని పరిస్థితుల్లో ఉన్నారు. మత రాజకీయాలు చేసినా..కౌంటర్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. అందుకే.. వైసీపీ నేతలు.. టీడీపీపై ఆరోపణలు చేసి..కవర్ చేసుకుంటున్నారు. ఈ పరిస్థితిని బీజేపీ మరింత అడ్వాంటేజ్ గా తీసుకుంటోందని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.
బీజేపీని మతం ద్వారనే ఎదుర్కోవాలనుకుంటున్న వైసీపీ..!
వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా.. బీజేపీని ఎదుర్కోవడానికి మతాన్నే వాడుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన క్రిస్టియానిటీని ప్రొత్సహిస్తున్నారు. ఇప్పటికే గిరిజన ప్రాంతాల్లో విపరీతంగా మత మార్పిడులు జరిగాయి. ఆ ప్రభావం.. స్పష్టంగా కనిపిస్తోంది. బాక్సైట్ తవ్వకాలకు.. వైఎస్ అనుమతులు ఇచ్చారని తెలిసినా… అక్కడ వైఎస్ జగన్ కే .. గిరిజనులు ఓట్లేశారు. చంద్రబాబు ప్రభుత్వం.. గతంలో ఎప్పుడూ లేనంతగా సాయం చేసినా.. గిరిజనులు.. తాము మార్చుకున్న మతాన్ని పాటించే జగన్ కోసమే ప్రార్థనలు చేశారు. ఆ తరహా… మార్పు కోసం.. జగన్ ఇతర వర్గాలపై దృష్టి పెట్టారని చెబుతున్నారు. ఇప్పుడు బీజేపీ వ్యతిరేకంగా పోటీకి వచ్చింది. ఇక ఏపీలో మత రాజకీయమే.