అవినీతిని కడిగేస్తామంటూ.. వైసీపీ నేతలు చేస్తున్న హడావుడి… ఇతరులకు ఇబ్బందికరంగా మారింది. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్‌గా ఉన్న ప్రవీణ్ ప్రకాష్ పై తాజాగా.. టీటీడీ చైర్మన్ బురద చల్లినంత పని చేశారు. ఓ సీనియర్ ఐఎఎస్ అధికారిపై.. ఎస్‌ఐ స్థాయి అధికారిని విచారణకు పంపించింది. ఇది తీవ్ర విమర్శలకు కారణం అవుతోంది. ఢిల్లీలో టీటీడీకి ఆలయం ఉంది. ఆ ఆలయానికి సంబంధించిన వ్యవహారాల కోసం.. ఢిల్లీలో. .. టీటీడీ లోకల్ ఎడ్వయిజరీ కమిటీని నియమించింది. ఈ కమిటీకి చైర్మన్ గా .. ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ఉంటారు. ఈ కమిటీ రూ. నాలుగైదు కోట్లు .. గోల్ మాల్ చేసిందనే ఆరోపణలను ఆకాశరామన్న పేరుతో కొంత మంది టీటీడీకి లేఖల ద్వారా ఫిర్యాదు చేశారు.
గతంలోనూ ఈ ఆరోపణలు వచ్చాయి. ఈ ఫిర్యాదుల పైన విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ దర్యాప్తు జరిపింది. నిబంధనలకు వ్యతిరేకంగా శ్రీవారి బ్రహ్మోత్సవాల పేరుతో చందాలు స్వీకరించారని .. రోజువారీ పూజలకు అవసరమైన పూలు, ఇతర వస్తువుల సరఫరా కాంట్రాక్టర్ల నుంచి అధికారులకు ముడుపులు తీసుకుని ఆకాశరామన్న పేరుతో టీటీడీకి కొంత మంది వ్యక్తులు ఫిర్యాదులు చేశారు. ప్రత్యేక పూజలు, పర్వదినాల్లో చేపట్టే కార్యక్రమాల్లోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయని లేఖలు రాశారు. ఈ లేఖలపై.. గత ప్రభుత్వ హయాంలోనే విచారణ జరిగింది. కానీ ఏమీ తేలకపోవడంతో.. అది ఆగిపోయింది.
టీటీడీకి కొత్త చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి వచ్చారు. ఆ పాత ఫిర్యాదును బయటకు తీసి… కొత్తగా విచారణ చేయమని.. ఓ ఎస్ఐ స్థాయి అధికారిని ఢిల్లీకి పంపారు. దీంతోనే వివాదం ప్రారంభమయింది. ఏపీ భవన్‌ను.. టీటీడీ తీవ్రంగా అవమానిస్తోందని రెసిడెంట్ కమిషనర్… భావించారు. ఏపీ భవన్ సిబ్బంది కూడా.. రికార్డుల తనిఖీకి పెద్దగా సహకరించలేదుని చెబుతున్నారు. చివరికి లోకల్ ఎడ్వయిజరీ కమిటీ చైర్మన్ పదవికి ప్రవీణ్ ప్రకాష్ రాజీనామా చేశారు.. టీటీడీ వైఖరి ఏపీ భవన్ విలువ తగ్గించేలా ఉందని మండిపడ్డారు. టీటీడీ వైఖరిని నిరసించారు. ఈ వ్యవహారం ఢిల్లీ అధికారవర్గాల్లో కలకలం రేపుతోంది.