ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం … ప్రజాధనంతో నియమించుకునే నియామకాల్లో తెలంగాణ ఉద్యమకారులకు స్థానం కల్పించడం వివాదాస్పదమవుతోంది. దేవులపల్లి అమర్ అనే సీనియర్ జర్నలిస్టును జాతీయ మీడియా, అంతర్రాష్ట్ర సంబంధాల సలహాదారుగా కొద్దిరోజల కిందట నియమించింది. ఈయన మామూలుగా ఏ ప్రాంతానికి చెందిన వారైనా.. తటస్థంగా ఉండి ఉంటే .. పెద్దగా వివాదం అయ్యేది కాదోమో కానీ.. తెలంగాణ ఉద్యమం సమయంలో… ఇతరులతో పోటీ పడి.. మరీ ఆంధ్ర ప్రజలను అవమానించారు. ఆంధ్ర ప్రాంతీయులు తెలంగాణను దోచుకున్నారని వాదించారు. ప్రసంగాలు చేశారు. అలాంటి ఉద్యమకారుడిని తీసుకు వచ్చి .. ఏపీ ప్రభుత్వం సలహాదారుగా నియమించడం… ఇతర జర్నలిస్టుల్లోనూ అసంతృప్తికి కారణం అవుతోంది.
ప్రస్తుతం సాక్షి లో ఉద్యోగిగా జీతం తీసుకుంటున్న దేవులపల్లి అమర్ ఇక నుంచి.. ఏపీ ప్రభుత్వ సలహాదారుగా ఉంటారు. ఆయనకు నెలకు రూ. మూడు లక్షలకుపైగా జీతాలు.. అలాగే.. ఇతర సిబ్బంది.. అలవెన్స్‌లు.. వాటితో పాటు.. టీ కప్పులు, స్ఫూన్ల కోసం.. మరో రూ. లక్షన్నర అలవెన్స్‌లు.. ఇతర సలహాదారులకు ఇచ్చినట్లుగా ఇవ్వడం ఖాయమే. అయితే.. ఎంత జీతం .. ఎంత అలవెన్సులన్నది మాత్రం.. ఇంకా బయటపెట్టలేదు. సీనియర్‌గా.. సలహాదారునిగా నియమించుకున్నారు కాబట్టి.. ఆయనకు ఆ మాత్రం జీతభత్యాలు ఉంటాయని భావిస్తున్నారు. ఏపీలో అనేక మంది సీనియర్ జర్నలిస్టులు ఉండగా.. తెలంగాణ నుంచి.. తీసుకు వచ్చి ఏపీలో పదవులు ఇవ్వడం ఏమిటని.. ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ మండిపడింది. నియామకాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది.
తెలుగుదేశం పార్టీ కూడా.. దేవులపల్లి అమర్ నియామకాన్ని ఖండించింది. ఆంధ్రులను దొంగలను నిందించిన వారికి… పదవులు ఇవ్వడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేసింది. అదే సమయంలో… ప్రజల్లోనూ ఆ అంశం చర్చనీయాంశమవుతోంది. ఉద్యమకారులకు.. తెలంగాణ సర్కారే పదవులు ఇవ్వడానికి సంకోచిస్తున్నప్పుడు.. ఏపీ ప్రభుత్వం .. ఆ బాధ్యత తీసుకోవడం ఏమిటన్న ఆశ్చర్యం ప్రజల్లోనూ వ్యక్తమవుతోంది. మరి ఏపీ సర్కార్.. ఎవరేమనుకున్నా… అంతా ఇష్టం అనుకుంటుందో..? ఇతర జర్నలిస్టులు… ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటుందో.. చూడాలి..!