తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై చర్చ ప్రారంభమైంది. పాలనలో తనదైన మార్క్ చూపిస్తానంటున్న కేసీఆర్.. ముందుగా.. పూర్తి స్థాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మార్పు చేర్పులు ఖాయమంటున్నారు. చేర్పులపై.. చాలా మంది పేర్లు ప్రచారంలోకి వస్తున్నప్పటికీ.. మార్పుల విషయంలో…మాత్రం పెద్దగా.. క్లారిటీ లేదు. అయితే.. ఇప్పుడు.. ఓ పేరుపై మాత్రం… టీఆర్ఎస్ వర్గాలకూ ఆ పార్టీ హైకమాండ్ స్పష్టత ఇస్తోంది. ఆ పేరే ఈటల రాజేందర్. ఆయనకు.. మంత్రివర్గ పునర్వవస్థీకరణలో.. బెర్త్ గల్లంతవబోతోందన్న ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి చాలా సూచనలు బయటకు వస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర సమితికి, ఆ పార్టీకి అనుబంధంగా.. అనేక మీడియా సంస్థలు ఉన్నాయి. తెలంగాణలో.. టీఆర్ఎస్ కు.. మంత్రులకు వ్యతిరేకంగా కథనాలు రాసే పరిస్థితి ఏ మీడియాకు లేదు. కానీ కద్ది రోజులుగా ఈటల రాజేందర్‌కు సంబంధించి వ్యతిరేక వార్తలు.. టీఆర్ఎస్ అనుకూల మీడియాలో హఠాత్తుగా ప్రారంభమయ్యాయి. ప్రగతి భవన్ లో జరిగిన రెవెన్యూ కొత్త చట్టంపై కీలక సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశానికి సంబంధించిన అంశాలను రహస్యంగా ఉంచాలని సమావేశంలో పాల్గొన్న మంత్రులకు, అధికారులకు కలెక్టర్లకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసినట్టు ప్రచారం జరిగింది. అయితే ఈటల రాజేందర్ మాత్రం.. కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులకు సమాచారాన్ని అందించారని … టీఆర్ఎస్కు చెందిన కొన్ని పత్రికలు ప్రచారం చేయడం ప్రారంభించాయి.
అలాంటిదేమైనా ఉంటే.. పై స్థాయిలో తెలియకుండా.. కథనాలు రాయడం అనేది జరగదని.. ఆయా పత్రికల్లో ఉండే పరిస్థితిని బట్టి అందరికీ అర్థమైపోతుంది. నిజానికి ఈటలకు.. మంత్రివర్గంలో చోటు దక్కడం చివరి నిమిషంలోనే ఖరారయింది. ఈటల రాజేందర్ కి కేటీఆర్ కంటే హరీష్ రావుతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, ఈ కారణంగా.. ఆయనను దూరం పెట్టాలని కేసీఆర్ అనుకున్నట్లుగా చెబుతున్నారు. మొత్తానికి సొంత పార్టీలో ఈటలకు సెగ ప్రారంభమైందని మాత్రం.. క్లారిటీ వస్తోంది. ఇది ఎంత వరకూ వెళ్తుందనేదే ఆసక్తికరం…!