ప్రభాస్ సొంత సంస్థ యూవీ క్రియేషన్స్ సూలూరు పేటలో ఓ మల్టీప్లెక్స్‌ని నిర్మించింది. దానికి వీ – ఎపిక్ అనే పేరు పెట్టారు. ఈనెల 29న ఈ మల్టీప్లెక్స్‌ని ప్రారంభించనున్నారు. 30 నుంచి ఈ థియేటర్లో సాహో ప్రదర్శిస్తారు. ఈ థియేటర్ రామ్ చరణ్ చేతుల మీదుగా లాంచ్ కానున్నదని సమాచారం. 29న రామ్‌చరణ్ హెలీకాఫ్టర్ పై సూలూరు పేట వెళ్లనున్నారని, చరణ్ ఈ మల్టీప్లెక్స్‌కి రిబ్బన్ కటింగ్ చేయనున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో రూపొందిన ఈ మల్టీప్లెక్స్ దాదాపు 60 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ మల్టీప్లెక్స్‌లో మొత్తం మూడు స్క్రీన్లున్నాయి. స్క్రీన్ 1, స్క్రీన్ 2 లు 375 సిట్టింగ్ కెపాసిటీతో నిర్మించారు. స్క్రీన్ 3 మాత్రం ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. దీని సిట్టింగ్ కెపాసిటీ 750. స్క్రీన్ ఎత్తు దాదాపు 100 అడుగులు. ఇండియాలో అత్యంత పెద్ద స్క్రీన్ ఇదే. ఈ మల్టీప్లెక్స్‌కి ఇంటిరీయర్, ఎక్స్టీరిజయ్ డిజైనింగ్ ప్రముఖ కళా దర్శకుడు ఎస్ రవీందర్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈగ, మగధీర లాంటి చిత్రాలకు కళా దర్శకుడిగా పనిచేశారాయన. యూవీ క్రియేషన్స్‌తో ఆయనకు మంచి అనుబంధం ఉంది. దాంతో ఈ థియేటర్ బాధ్యతని ఆయనకే అప్పగించారు.