దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రం సాహో. ఈ సినిమా కోసం ప్రభాస్ అండ్ టీమ్ రెండేళ్లు కష్టపడింది. పాన్ ఇండియా సినిమాగా `సాహో` ఈనెల 30న విడుదల కాబోతోంది. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ ఉండే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రభాస్ ముందుకే తీసుకెళ్తే.. “ఆ ఆలోచన ఉంది. కానీ అది `సాహో` రిజల్ట్‌పై ఆధారపడి ఉంది. సాహోకి వచ్చిన ఆదరణ చూసి సీక్వెల్ విషయాన్ని ఆలోచిస్తాం. అయితే అది ఇప్పుడే ఉండకపోవొచ్చు. దానికి కొంత సమయం తీసుకుంటా” అని చెప్పుకొచ్చాడు ప్రభాస్. సాహోలో చాలా ట్విస్టులున్నాయి. క్లైమాక్స్ ట్విస్టు ఈ కథ స్వరూపాన్నే మార్చేస్తుందని తెలుస్తోంది. సాధారణంగా హాలీవుడ్ యాక్షన్ చిత్రాలు, థ్రిల్లర్లు, హారర్లు సీక్వెల్‌కి ముందే ఓ దారి వేసుకుంటుంటాయి. క్లైమాక్స్‌లో ఓ ట్విస్టు అట్టి పెట్టి `పార్ట్ 2`కి కథ రెడీ చేసుకుంటాయి. ‘సాహో’కీ అలాంటి ముగింపు ఉండబోతోంది. మరి ఈ కథని ఎలా ముగిస్తారో? సీక్వెల్‌కి ఏ పాయింట్ నుంచి అంకురార్పణ చేస్తారో తెలియాలంటే ఇంకొద్ది గంటలు ఎదురుచూడాల్సిందే.