సెప్టెంబరు 13న ఒకేసారి రెండు సినిమాలు రాబోతున్నాయి. ఒకటి గ్యాంగ్ లీడర్ అయితే, మరోటి వాల్మీకి. రెండూ క్రేజీ ప్రాజెక్టులే. ఓ సినిమా వల్ల మరో సినిమా వసూళ్లపై దెబ్బ పడే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పుడు ఇద్దరు నిర్మాతలూ ఓ నిర్ణయానికి వచ్చారు. కలసి కూర్చుని మాట్లాడుకుని – ఒకరు తగ్గడానికి రెడీ అయ్యారు. ముందు అనుకున్న ప్రకారం 13న గ్యాంగ్ లీడర్ వస్తోంది. ఓ వారం తరవాత.. అంటే 20న వాల్మీకి విడుదల అవుతుంది. దాని వల్ల రెండు సినిమాలకూ లాభమే. గ్యాంగ్ లీడర్ అప్పుడే ప్రమోషన్లు ప్రారంభించేసింది. రేపు (బుధవారం) ట్రైలర్‌ని విడుదల చేస్తారు. సెప్టెంబరు మొదటి వారంలో ప్రమోషనల్ గీతం వస్తుంది. మరోవైపు వాల్మీకి కూడా ప్రమోషన్లకు శ్రీకారం చుట్టింది. టీజర్ ఇప్పటికే వచ్చేసింది. థియేట్రికల్ ట్రైలర్ కూడా రెడీ అవుతోంది.