ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతంలో.. తనకు ఒక్క అంగుళం భూమి ఉన్నా… వివరాలు బయపెట్టాలని.. సవాల్ చేసిన… మాజీ కేంద్రమంత్రి సుజనా చౌదరికి.. మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు. మంత్రి బొత్స బంధువుర్గానికి సంబంధించి ఉన్న భూముల వివరాలను బయటపెట్టారు. సుజనాచౌదరి బంధువులు, కంపెనీలకు రాజధానిలో భూములు ఉన్నాయని ప్రకటించారు. చందర్లపాడు మండలం గుడిమెట్లలో గ్రీన్ టెక్ కంపెనీకి 110 ఎకరాలు ఉన్నాయని… ఆ కంపెనీ.. సుజనా చౌదరిదని… బొత్స ప్రకటించారు. సుజనాచౌదరికి ఉన్న 120 కంపెనీల్లో గ్రీన్‌టెక్ ఒకటని ప్రస్తుతం.. ఆ కంపెనీకి… సుజనా కజిన్ జితిన్‌కుమార్.. ఎండీగా ఉన్నారని ప్రకటించారు. అలాగే.. సుజనా సోదరుడి కుమార్తె రుషికన్య పేరుతో.. వీరులపాడు మండలం గోకరాజుపాలెంలో 14 ఎకరాలు ఉన్నాయని ప్రకటించారు. ఇవన్నీ చూస్తే..ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని తేలిపోతుందని ప్రకటించారు.
నిజానికి సుజనావి అంటూ..బొత్స ప్రకటించిన ఆస్తులు… చందర్ల పాడు, వీరులపాడు మండలాల్లో ఉన్నాయి. రాజధాని పరిధిలో ఉన్న 29 గ్రామాల్లో ఏ ఒక్కటి కూడా.. ఆ మండలాల పరిధిలో లేవు. చందర్ల పాడు, వీరుల పాడు మండలాలు..కృష్ణా జిల్లా కిందకు వస్తాయి. ఓ రకంగా అవి నల్లగొండ జిల్లా బోర్డర్‌లో ఉంటాయి. అమరావతి నుంచి కనీసం.. వంద కిలోమీటర్ల దూరం ఉంటుంది. అయితే.. బొత్స సత్యనారాయణ మాత్రం.. అవన్నీ రాజధాని పరిధిలో ఉన్న భూములుగా… రాజధాని ప్రకటన తర్వాత కొన్న భూములన్నట్లుగా ప్రకటించారు. యలమంచిని సత్యనారాయణ చౌదరి అలియాస్ సుజనా చౌదరి స్వగ్రామం… కంచికచర్ల దగ్గరే ఉంటుంది. అక్కడే ఆయనకు.. ఆయన కుటుంబానికి వారసత్వంగా వచ్చిన ఆస్తులు ఉన్నాయి.
బొత్స సత్యనారాయణకు సవాల్ చేసేటప్పుడు కూడా.. ఇదే విషయాన్ని చెప్పారు. కృష్ణా జిల్లాలో అయినా… ఎక్కడైనా.. తనకు వారసత్వంగా వచ్చిన ఆస్తులు.. 2010 కన్నా ముందు కొన్నవి తప్ప.. ఆ తర్వాత ఏమైనా కొనుగోలు చేసి ఉంటే నిరూపించాలని సవాల్ చేశారు. దీనిపై స్పందించిన బొత్స… రాజధాని పరిధిలో కాకుండా… సుదూరంగా … ఉన్న ఊళ్లలోని ఆస్తుల వివరాలను ప్రకటించారు. ప్రభుత్వం సీఆర్డీఏను ఏర్పాటు చేసినప్పుడు.. రాజధానిగా అభివృద్ధి చేయాలని.. కొంత ఏరియాలను సీఆర్డీఏ పరిధిలోకి తెచ్చింది. అది అమరావతికి అటూ ఇటూ వంద కిలోమీటర్ల వరకూ ఉంటుంది. దాంతో.. ఈ పరిధినే బొత్స పరిగణలోకి తీసుకున్నారు. ఇంకా అవినీతిని నిరూపిస్తామని… వెయిట్ చేయాలని బొత్స సూచించారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ పడిపోయినా.. మిగతా రాష్ట్రం మొత్తం పెరిగిందన్నారు.