ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇసుకను మార్కెట్ రేటు కన్నా తక్కువకే అందించాలని నిర్ణయించింది. స్వయంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ ఆదేశాలను.. అధికారులకు సమీక్ష సందర్భంగా ఇచ్చారు. తగినంత ఇసుకను అందుబాటులో ఉంటుకోవాలని..లేకపోతే రేట్లు పెరుగుతాయని కూడా.. జాగ్రత్తలు చెప్పారు. స్టాక్ పాయింట్లు పెంచుకోవాలని.. కావాలంటే.. మరికొన్ని రీచ్‌లను కూడా గుర్తించాలన్నారు. అయితే.. ముఖ్యమంత్రి చెప్పిన మార్కెట్ రేటు విషయమే…య అధఇకారులకు మింగుడు పడలేదు. ఇసుకేమీ.. ఫ్యాక్టరీల్లో ఉత్పత్తి చేసే సిమెంట్ కాదు. పది సంస్థలు ఇందులో లేవు. ఉత్పత్తిని పెంచి.. తగ్గించి.. మార్కెట్లో ధరలు ప్రభావితం చేయడానికి. కానీ సీఎం మాత్రం.. ఇదేదో మార్కెట్లో ఉత్పత్తయ్యే వస్తువుగా భావించి మార్కెట్ రేటు కంటే తక్కువకే ఇస్తామని ప్రకటించడం ఆశ్చర్యానికి కారణం అయింది.
ఇసుక అనేది.. ప్రైవేటు వ్యక్తులు సరఫరా చేసే అవకాశమే లేదు. పూర్తిగా ప్రభుత్వ యంత్రాంగం సరఫరా చేయాల్సిందే. తరలింపునకు ప్రైవేటు వ్యక్తుల సేవల్ని ఉపయోగించుకున్నా.. ఇసుక ప్రభుత్వ ఆస్తి. అలాంటప్పుడు.. దానికి మార్కెట్ రేటు ఎక్కడి నుంచి వస్తుంది..? ప్రభుత్వం నిర్ణయించేదే మార్కెట్ రేటు. కానీ..సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం… ఈ విషయంలో… మార్కెట్ రేటును..అంచనా వేశారు. ఎంత మాత్రం అంచనా వేశారో… అంత కన్నా.. తక్కువకే ఇవ్వాలని అధికారులకు చెప్పారు. నిజానికి ఇంత వరకూ… ఇసుకను… ఏ ధరలకు ప్రజలకు అందుబాటులోకి తెస్తారో… ప్రభుత్వం ప్రకటించలేదు.
కానీ.. మార్కెట్ రేటు మాత్రం.. ఇప్పుడు.. ట్రాక్టర్ ఇసుక ఏడు వేల నుంచి పది వేల వరకూ ఉంది. ఇదంతా.. అనధికారికంగా నిజానికి… ఇసుక సరఫరా ఏపీలో పూర్తిగా అగిపోయింది. అక్రమ ఇసుక మాత్రమే రవాణా అవుతోంది. నిబంధనల ప్రకారం ఒక్కటన్ను ఇసుక తరలించాలంటే.. అనుమతుల కోసం నెల రోజులు వెయిట్ చేయాల్సిందే. అలాంటి పరిస్థితుల్లో… అత్యవసరం అయిన వారు..ఎక్కువ రేటు పెట్టి ఇసుక కొనుగోలు చేసి.. పనులు ఆగకుండా చూసుకుంటున్నారు. బహుశా.. ఏపీ సీఎం.. బ్లాక్ మార్కెట్ లో ప్రస్తుతం ఉన్న ఇసుక రేటునే .. మార్కెట్ రేటుగా అంచనా వేసుకుని అంత కంటే.. తక్కువకే ప్రజలకు ఇవ్వాలని అధికారులకు సూచించినట్లుగా అర్థం చేసుకోవాలేమో..?