ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపై అందరూ మాట్లాడుతున్నారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకూ… పురపాలక మంత్రి దగ్గర్నుంచి .. బీజేపీ అధికార ప్రతినిధి వరకూ.. అందరూ స్పందించారు. అందరూ.. అమరావతిని తరలించడమే మిగిలిందని… చెప్పుడం ప్రారంభించారు. ఈ విషయంలో చాలా మందికి చాలా సందేహాలున్నాయి. అందరూ.. ఒకే ఒక్కరి దగ్గర నుంచి క్లారిటీ కోరుతున్నారు. ఎవరెన్ని మాట్లాడినా.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయమే ఫైనల్. ఆయన తరలించాలి అనుకుంటే.. ఆపేవారు లేరు. అందుకే.. జగన్మోహన్ రెడ్డి నిర్ణయం కోసం… అందరూ ఎదురు చూస్తున్నారు. కానీ ఆయన మాత్రం.. అమరావతి విషయంలో… నోరు తెరవడం లేదు.
ఓ ప్రణాళిక ప్రకారమే వైసీపీ నేతల ప్రకటనలు..!
వైసీపీ నేతలు ఎవరు.. ఎలాంటి ప్రకటనలు చేసినా.. అది కచ్చితంగా… ఆ పార్టీలో పై స్థాయి నుంచి వచ్చే ఆదేశాల మేరకే జరుగుతుందని.. ఆ పార్టీ నేతలందరికీ తెలుసు. ఆ క్రమంలో బొత్స చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో.. ప్రజల ప్రతిస్పందన తెలుసుకోవడానికి అటు బొత్సతో పాటు.. ఇటు ఎంపీలు, మంత్రులతో… వరుసగా ప్రకటనలు చేయిస్తూనే ఉన్నారు. ఫలితంగా.. మొత్తం వ్యవహారం గందరగోళంగా మారింది. సీఎం ఇంతకు మించి కోరుకుంటున్నారేమో కానీ.. ఇప్పటికీ… సరైన క్లారిటీ రాలేదు.. ముఖ్యమమంత్రి సైలెంట్ గా ఉండటం వల్ల.. అమరావతి చుట్టూ.. అనేక రకాల డిమాండ్లు వినిపించడం ప్రారంభించాయి. మొదటగా… బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్… నాలుగు రాజధానుల ప్రస్తావన తీసుకు వచ్చారు. అదే కలకలం రేపితే.. తాజాగా.. టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు .. విశాఖను ఆర్థిక రాజధానిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కేంద్రానికి జగన్ ఇచ్చిన సమాచారం మేరకే జీవీఎల్ ప్రకటన..!
ఇప్పటికే.. వివిధ పార్టీల నుంచి రాజధాని డిమాండ్లు విభిన్న రీతిలో వినిపించడం ప్రారంభమయ్యాయి. వైసీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి కర్నూలును రాజధానిగా చేయాలన్నారు. కాంగ్రెస్ నేత చింతా మోహన్.. రాజధానిగా తిరుపతికి మించిన ప్లేస్ ఉండదని ప్రకటించారు. మరికొంత మంది నేతలతూ.. తమ తమ నియోజకవర్గాలు… జిల్లా కోసం.. ఈ రాజధాని డిమాండ్ల రేసులో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరిసంహారావు.. ఏపీ ప్రభుత్వ ఉద్దేశాన్ని స్పష్టంగా ఢిల్లీలో చెప్పిన తర్వాత.. ఎవరూ.. కూడా.. అమరావతిని రాజధానిగా… వైసీపీ సర్కార్ ఉంచుందని నమ్మలేకపోతున్నారు. అందుకే.. ఈ డిమాండ్లు మరింత ఊపందుకునే అవకాశం కనిపిస్తోంది.
ఏదో తేల్చకుండా ఎందుకీ మౌనం..! దీని వల్ల ఎవరికి నష్టం..?
నిజానికి అమరావతిలో.. వేల కోట్ల రూపాయల పనులు జరిగాయి. పెద్ద ఎత్తున రోడ్ల నిర్మాణం జరిగింది. ఇలాంటి సమయంలో భూములు తిరిగివ్వడం అంటే… అసాధ్యమని.. అందరికీ తెలుసు. ఇదే పెద్ద చిక్కుముడిగా మారింది. సీఎం… అమరావతిని మార్చదల్చుకుంటే… భూములిచ్చిన రైతులకు ఏం చేయాలనేది.. అది పెద్ద సమస్యగా మారుతుంది. అందుకే.. మౌనం పాటిస్తున్నారని అంటున్నారు. కానీ ఈ మౌనం బాధ్యతల నుంచి తప్పించుకోవడం అవుతుంది. అలా చేయడం.. ముఖ్యమంత్రిగా వైఫల్యం అవుతుంది. ఆలస్యంగా నిర్ణయం ప్రకటించినా జరగాల్సిన నష్టం జరుగుతుంది.