టాలీవుడ్ లోనే కాదు, మొత్తం ఇండియాలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా పేరు తెచ్చుకున్నాడు ప్రభాస్. తన అభిమానుల్లో అమ్మాయిల వాటా కూడా ఎక్కువగానే ఉంటుంది. బాహుబలి తరవాతైతే లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా బాగా పెరిగిపోయింది. పైగా ఆరడగుల అందగాడు. మిస్టర్ పర్‌ఫెక్ట్, మిర్చి, డార్లింగ్.. ఇలాంటి సినిమాల్లో ప్రభాస్ లుక్ అదిరిపోయింది.
అయితే సాహోలో ప్రభాస్ లుక్ చాలా తేడాగా కనిపించింది. టీజర్, ట్రైలర్లలో ఏదో మేనేజ్ చేయగలిగారు గానీ… సినిమాలో మాత్రం ప్రభాస్ లుక్ మైనస్‌గా మారింది. ప్రభాస్ డైహార్డ్ ఫ్యాన్స్‌కి సైతం ప్రభాస్ లుక్ ఈ సినిమాలో నచ్చలేదు. ప్రభాస్ స్టైలింగ్ కోసం చిత్రబృందం చాలా కష్టపడింది, ఎంతో ఖర్చు పెట్టింది. ముంబై నుంచి పేరున్నవాళ్లని రంగంలోకి దింపింది. అయితే.. ఫలితం కనిపించలేదు. ప్రభాస్ ట్రిమ్ షేవ్ మరింత దెబ్బకొట్టింది. పాటల్లో తన డ్రెస్సింగ్ సెన్స్ బాగున్నా – మిగిలిన సన్నివేశాల్లో మాత్రం తేలిపోయింది. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు. అలాంటప్పుడు స్టైలింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అతని హెయిర్ స్టైల్ కూడా ఒక్కో సమయంలో ఒక్కోలా కనిపించింది. ఇదంతా కేర్ లెస్‌గా జరిపోయిన వ్యవహారాలా? లేదంటే దాన్నే కొత్తదనం అనుకున్నారా? అనేది చిత్రబృందానికే తెలియాలి. ఏదైతేనేం.. లుక్ విషయంలో ప్రభాస్ జాగ్రత్తగా ఉండాలన్న సంకేతాల్ని సాహో పంపింది.