అట్లాంటా, గురువారం 29వతేది ఆగష్టు 2019: భారతీయ సినిమా పరిశ్రమలో యాక్షన్, థ్రిల్లర్ జోనర్ సినిమాలపై ప్రేక్షకుల్లో క్రేజ్ ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద సందడి చేయడం కాస్త తక్కువగానే కనిపిస్తుంది. కానీ అలాంటి రిస్క్‌ను ఎదురిస్తూ, అత్యంత సాంకేతికతతో, భారీ బడ్జెట్‌తో రూపొందించిన చిత్రం సాహో. బాహుబలి తర్వాత ప్రభాస్‌కు పెరిగిన క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని, హాలీవుడ్ ప్రమాణాలకు ధీటుగా తీసిన చిత్రం సాహో యువి క్రియేషన్స్ ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది.
ఉత్తర అమెరిక రెబల్ స్టార్స్ ప్రబాస్ ఫేన్స్ ఆధ్వర్యంలో అట్లాంటలో 8కె థియేటర్స్ యాజమాన్యంలో డిజిమేక్స్ థియేటర్ లో ప్రత్యేక ఫేన్స్ ప్రిమియర్ షో రాత్రి 9 గంటలకు అభిమానుల హడావుడిలో కొలాహలం మద్య ప్రబాస్ కి విషెష్ చెప్తూ కేక్ కట్ చేయడం జరిగింది.
రాత్రి 8 గంటలకు ఫైర్ వర్క్స్ తో ప్రారంభం అయ్యిన సందడి సుమారు 100 మంది ఫేన్స్ ప్రభాస్ టీ షర్ట్స్, హేడ్ బేండ్స్ దరించి ఉత్సాహంగా పాల్గొన్నారు. దియేటర్ ని కూడా చక్కగా ప్రభాస్ బేనర్స్ పెట్టి తమకున్న అభిమానాన్ని చాటుకొన్నారు.
రెబల్ స్టార్ ప్రభాస్ ఫేన్స్ ప్రెసిడెంట్ శ్రీ హెమంత్ వర్మ గారు మాట్లాడుతూ అభిమానలందరికి దన్యవాదములు చెప్పారు. అంతే కాకుండా డార్లింగ్ ప్రభాస్ అసోషియేషన్ తరుపున సింహాచలం, విశాఖపట్టణంలో ఒక పేద విద్యార్ధికి 14000 వేల రూపాయిలు విరాళం గా కూడా ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమాన్ని రెబల్ స్టార్ ప్రభాస్ ఫేన్స్ అసోషియేష్ ప్రెసిడెంట్ హెమంత్ వర్మ గారు, కార్యనిర్వాహకులు రాజు మండపాటి గారు మరియు కరోతు సురేష్ గారు చక్కగా నిర్వహించారు. అలాగే దక్కన్ స్పైస్ రెస్టారెంట్ వారు చక్కని పలహారాలు స్పాన్సర్ చెయ్యడం జరిగింది.
ఇంతటి అవకాశం ఇచ్చిన డిజిమేక్స్ మరియు 8కె థియేటర్ యాజమాన్యంకు మరొక్కసారి అభినందనలు.
మరిన్ని ఫొటోస్ మరియు విడియోస్ కోసం ఈ క్రిందనీయబడిన లింక్ లో చూడండి.