ఆంధ్రప్రప్రదేశ్ ప్రభుత్వ గ్రామ సచివాలయాల వ్యవస్థను తీసుకు రావాలని నిర్ణయించింది. గ్రామ సచివాలాయాలన్నీ గ్రామపంచాయతీ ఆఫీసుల్లోనే ఏర్పాటు చేస్తారు. అయితే… ఇప్పుడు ప్రత్యేకంగా వాటికీ గుర్తింపు ఉండాలనుకుంటున్న ప్రభుత్వం.. కొత్తగా.. రంగుల డిజైన్లు చేసి.. మరీ… ఎలా ఉండాలో నిర్దేశిస్తూ.. ఉత్తర్వులు జారీ చేసింది. అచ్చంగా అవన్నీ… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలు ఏ రంగులో ఉంటాయో.. అచ్చంగా అదే రంగులో ఉండేలా… డిజైన్లను ఉత్తర్వులకు ఎటాచ్ చేశారు. మోడల్‌గా..ఓ భవనానికి రంగులేసి మరీ ఆ ఫోటోను జత చేశారు. ఇప్పటికే గ్రామాల్లో ఉన్న పంచాయతీ భవనాలను ఇదే విధంగా మార్పులు చేయాలని, కొత్తగా ఏర్పాటు చేసే చోట ఇదే విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
అక్టోబరు 2 నుంచి అమలులోకి వచ్చే గ్రామ సచివాలయాల వ్యవస్థను ప్రభుత్వం అమలులోకి తెస్తుంది. గ్రామ సచివాలాయాల్లో పది మంది వివిధ రకాల ఉద్యోగులుంటారు. వారందరూ.. రెండు వేల మంది జనాభా అవసరాల్ని తీరుస్తారు. ప్రభుత్వ పథకాలు.. ఇతర ఏ ప్రభుత్వ సేవ అయినా… గ్రామ సచివాలయం ద్వారానే సాగేలా ప్రభుత్వం రూపకల్పన చేసింది. దానికి సంబంధించిన ఉద్యోగుల ఎంపిక … ప్రక్రియ జరుగుతోంది. వారంలో పరీక్షలు కూడా పూర్తవుతాయి. ఆ తర్వాత ఎంపిక జరుగుతుంది. ఇంత వరకూ బాగానే ఉన్నా.. గ్రామ సచివాలాయాలకు.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులేయడం ఏమిటన్న చర్చ గ్రామాల్లోనూ ప్రారంభమయింది. అన్న క్యాంటీన్లకు… పసుపు రంగు ఉందని.. చెప్పి.. అధికారంలోకి రాగానే.. ఉన్న పళంగా.. పెద్ద ఎత్తున ఖర్చు పెట్టి మరీ.. అన్నింటికీ వైట్ కోటింగ్ వేయించింది ప్రభుత్వం.
ఇప్పుడు.. గ్రామ పంచాయతీ భవనాలకు… అలాంటి పసుపు రంగేది లేకపోయినప్పటికీ… పార్టీ రంగులు వేయడానికి సిద్ధమయిపోయింది. నిజానికి ప్రభుత్వం కట్టించే ఇళ్లు.. ఇతర వాటికి ఆయా ప్రభుత్వాలు ఉన్నప్పుడు.. తమ పార్టీ గుర్తులను… ఏదో విధంగా.. చూపించేలా రంగులేయిస్తారు కానీ… ప్రభుత్వ ఆఫీసులకు మాత్రం… పార్టీ రంగులు వేసే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. మొదటి సారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. పంచాయతీ ఆఫీసులకు నేరుగా… తమ పార్టీ గుర్తులు .. ప్రభుత్వ సొమ్ము.. అంటే ప్రజల సొమ్ముతోనే వేయిస్తోంది.