రాజధాని విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ట్రాప్‌లో పడొద్దని.. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సూచించారు. రాజధాని గ్రామాల్లో రెండో రోజు పర్యటించిన ఆయన రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా… జగన్మోహన్ రెడ్డి సర్కార్ తీరుపై..సునిశితంగా విమర్శలు చేశారు. ముఖ్యంగా రాజధానిపై తీవ్ర స్థాయి గందరగోళం రేపిన బొత్స సత్యనారాయణను ఉద్దేశించి పవన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ మాయలో బొత్స పడొద్దని..జాగ్రత్తగా మాట్లాడితే మంచిదన్నారు. రాజధానిని మారుస్తామంటూ గందరగోళం సృష్టించడం మానుకోవాలన్నారు. ఏపీ సర్కార్ ప్రస్తుతం… విధ్వంస ప్రకటనలు జగన్ కుటుంబానికి చెందినవారు చేయరని… చెడు వార్తలన్నీ బొత్స, అనిల్‌తో జగన్ చెప్పిస్తున్నారని పవన్ గుర్తు చేశారు.
పవన్ కల్యాణ్ ఉద్దేశంలో… జగన్ కుటుంబం అంటే.. జగన్ సామాజికవర్గం మంత్రులన్న అభిప్రాయం వినిపిస్తోంది. కొద్ది రోజులుగా… సోషల్ మీడియాలోనూ ఇదే తరహా చర్చ నడుస్తోంది. ఇప్పుడు పవన్ కూడా అదే మాటలు చెప్పారు. రాజధానికి రాజకీయ, కుల రంగులు పులమడం సరికాదన్నారు. బొత్స అమరావతిలో రాజధాని వద్దంటున్నారంటే… మోదీని, అమిత్‌షాను వ్యతిరేకిస్తున్నట్టేనని .. ఫోక్స్‌వ్యాగన్ కేసులను బొత్స గుర్తించుకోవాలని పవన్ హెచ్చరించారు. ఉమ్మడి రాష్ట్రంలో చివరి సీఎం కావాలనుకున్న బొత్స… రాజధాని అమరావతిపై కులం ముద్ర వేయడం మంచిది కాదన్నారు. బొత్స తన అనుభవాన్ని ప్రజల శ్రేయస్సుకోసం ఉపయోగించాలన్నారు. ఏమో ఇప్పుడు బొత్స సీఎం అవ్వొచ్చేమోనని పవన్ వ్యాఖ్యానించారు.
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు..కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని హెచ్చరించారు. పవన్ కల్యాణ్ అధికారులకు కూడా..ఇలాంటి సూచనలే చేయడం..ఆసక్తి కలిగిస్తోంది. వచ్చే ఎన్నికల తర్వాత సీఎంగా జగన్ రెడ్డి.. మంత్రులుగా బొత్స, అనిల్ ఉండకపోవచ్చునని.. కానీ అధికారులు ఉంటారని ఆలోచించి సలహాలు ఇవ్వాలని సూచింాచరు. పవన్ కల్యాణ్ తన ప్రసంగంలో …. వైసీపీ గెలుపుపై అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. కాలమో లేదా ఈవీఎంల ఘనతో తెలియదు కానీ వైసీపీ గెలిచిందని వ్యాఖ్యానించి కలకలం రేపారు.