ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ వైఖరి ఉందని… మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. జగన్ మాయలో పడొద్దని.. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ స్పందించారు. ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలనుకున్న బొత్స… మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండొచ్చని.. అందుకే.. జగన్ మాయలో పడి… రాజధానికి కుల, మత ప్రాంతాలను అంటగట్టవద్దని… పవన్ సూచించారు. దీనిపైనా.. బొత్స వివరణ ఇచ్చారు. తాను రెండు మెట్లు కిందకు దిగి మరీ వైసీపీలో చేరుతున్నానని గతంలోనే చెప్పానని… తన స్టేట్మెంట్లను.. ఇతర రాజకీయ అడుగులను సమర్థించుకున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలుపును కాలమో.. ఈవీఎంల ఘనతో తెలీదన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను కూడా బొత్స తప్పు పట్టారు. జగన్మోహన్ రెడ్డి చిత్తశుద్ధిని చూసే.. ప్రజలు గెలిపించారని.. స్పష్టం చేశారు.
పవన్ చేసిన పలు రకాల విమర్శలకు సూటిగా కౌంటర్ ఇవ్వని బొత్స సత్యనారాయణ.. పవన్ కల్యాణ్‌కు.. టీడీపీ లింక్ పెట్టి విమర్శలు చేయడానికి ప్రాధాన్యం ఇచ్చారు. పవన్ కల్యాణ్ అమరావతిలో ఇల్లు కట్టుకోవడానికి … చంద్రబాబు కరకట్టపై నివాసం ఉండటానికి స్థలాలు ఇచ్చింది.. ఒకరు కాదా.. అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్.. టీడీపీ భూ దోపిడీకి మద్దతిస్తున్నట్లుగా ఉందని మండిపడ్డారు. చంద్రబాబు ఆర్థిక లావాదేవీలకు పవన్ వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు.
రాజధాని విషయంలో బొత్స సత్యనారాయణను.. పవన్ కల్యాణ్ నేరుగా విమర్శించలేదు. బొత్సను కేవలం .. జగన్మోహన్ రెడ్డి ఓ పావుగా వాడుకుంటున్నారని మాత్రం పవన్ కల్యాణ్ విమర్శించారు. బొత్సను అడ్డం పెట్టుకుని రాజధానిపై కులం, ప్రాంతం రంగు పూస్తున్నారని ఆరోపించారు. ఈ ట్రాప్‌లో పడొద్దని పవన్ సూచించారు. గతంలో ముఖ్యమంత్రి పదవికి దగ్గరగా వెళ్లారని.. భవిష్యత్‌లో అలాంటి అవకాశం వస్తే… .. రాజధానికే.. కులం, ప్రాంతం అంటగట్టిన వ్యక్తిగా.. సర్వామోదం లభించదన్న ఉద్దేశంతో.. పవన్ అలాంటి వ్యాఖ్యలు చేశారు. అయితే.. బొత్స మాత్రం.. వీటన్నింటికీ వివరణ ఇవ్వకుండా.. పవన్ కల్యాణ్‌కు.. టీడీపీకి లింక్ పెట్టి విమర్శలు చేయడానికే ప్రాధాన్యం ఇచ్చారు.