రాజమౌళి – ప్రభాస్ మధ్య అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇండ్రస్ట్రీలో ప్రభాస్‌కి అతి దగ్గరైన వ్యక్తుల్లో రాజమౌళి ఒకడు. బాహుబలితో వీరిద్దరి అనుబంధం మరింత బలపడింది. బాహుబలి తరవాత ఎలాంటి సినిమా చేస్తే బాగుంటుందన్న విషయంలో సలహాలు ఇచ్చింది కూడా రాజమౌళినే. సాహో కథ విన్న వెంటనే నిర్ణయం తీసుకునే ముందు ప్రభాస్ సంప్రదించిన వ్యక్తి కూడా రాజమౌళినే. సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా వచ్చింది కూడా జక్కన్ననే.
అంతేకాదు.. సాహో ఫైనల్ వర్షన్ చూసి `ఓకే.. గో ఎహెడ్` అని ముద్ర వేసింది కూడా జక్కన్నే అని టాక్. ఈ సినిమా లెంగ్త్ 3 గంటలు దాటేస్తే… అందులోంచి పావుగంట కుదించింది కూడా జక్కన్నేనట. మొత్తానికి సాహో విషయంలో తెర వెనుక నుంచి రాజమౌళి చేసిన సహాయం చాలానే ఉంది. సినిమా హిట్టయితే.. ఈ విషయాన్నీ బయటకు వచ్చేవి. కానీ ఫలితం తేడా కొట్టడంతో ఎవ్వరూ చెప్పుకోవడం లేదు. కనీసం రాజమౌళి కూడా సాహోపై ఒక్క ట్వీటూ చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.