వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన మూడు నెలల కాలంలో.. ఉద్యోగుల్లో అప్పుడే అసంతృప్తి ప్రారంభమైన సూచనలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ సంఘాలు.. ప్రభుత్వం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. పండుగల సమయంలోనూ… కనీసం ఒక్క రోజు ముందు జీతాలు ఇచ్చే ఏర్పాటు చేయకపోవడం… ఉద్యోగ సంఘాలు.. పదే పదే ఈ విషయాన్ని గుర్తు చేసినప్పటికీ… ఉన్నతాధికారులు లైట్ తీసుకోవడంతో… ఈ సారి జీతం లేకుండా.. .వినాయకచవితి పండుగను ఉద్యోగులు జరుపుకోవాల్సి వచ్చింది.
సాధారణంగా ఒకటో తేదీ ఆదివారం.. రెండో తేదీ పండుగ ఉందంటే.. ప్రభుత్వం… 31 లేదా.. అంతకు ఒకటి, రెండు రోజుల ముందే జీతం ఇచ్చే ఏర్పాట్లు చేస్తుంది. కానీ ప్రస్తుత ఏపీ సర్కార్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించింది. ఒకటో తేదీ ఆదివారం, రెండో తేదీన వినాయక చవితి పండుగ సందర్భంగా.. సెలవులు ఉంటాయని తెలిసి కూడా.. నెలాఖరు రోజు అయిన … 31వ తేదీన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి సిద్ధపడలేదు. సెలవులు అయిపోయిన తర్వాత మూడో తేదీ తర్వాత జీతాలు లభిస్తాయని… ముందస్తుగా.. సమాచారం ఉద్యోగులకు చేరవేసి తమ బాధ్యత తీరిపోయిందనుకున్నారు. ప్రభుత్వం మాత్రం.. భిన్నమైన కోణంలో.. ఆర్థిక వ్యవహారాలను చక్క బెడుతోంది. ప్రభుత్వం మారిన తర్వాత ఒక్క నెల కూడా.. సరైన సమయానికి జీతాలు అందడం లేదనే అసంతృప్తి ఉద్యోగుల్లో కనిపిస్తోంది.
ఓ సారి సాంకేతిక సమస్యలని.. మరో సారి ఆర్బీఐ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేసిందని.. చెప్పి.. కవర్ చేసుకున్నారు. ఒకటి, రెండు రోజుల ఆలస్యంతో జీతాలు ఇచ్చారు. ఈ నెల కూడా అదే పరిస్థితి. ఈ సారి సాఫ్ట్ వేర్, సాంకేతిక సమస్యల గురించి చెప్పుకోవాల్సిన పని లేకుండా.. ఓ ఆదివారం.. మరో పండుగ వారికి కలిసి వచ్చింది. గతంలో… ఏ సర్కారైనా… ఇలాంటి పరిస్థితులు వస్తే.. ప్రత్యేకంగా జీవో జారీ చేసి మరీ… మూడు రోజుల ముందే జీతాలిచ్చిన సందర్భాలున్నాయి. వీటినే సోషల్ మీడియాలో గుర్తు చేసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన వారంలో సీపీఎస్ రద్దు అన్నారు కానీ.. మూడు నెలలు గడిచినా.. దానికి సంబంధించి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
అదే సమయంలో.. సామాజిక పెన్షన్ల విషయంలోనూ.. మరింత టెన్షన్ తప్పడం లేదు. ప్రతీ సారి పెన్షన్ ఇచ్చే ఉద్యోగులు ఈ సారి రారు. ఈ సారి వాలంటీర్లు వచ్చారు. వారు ఇంటికే వచ్చి ఇస్తారని చెబుతున్నారు. వారు ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు ఇస్తారోననే టెన్షన్ పెన్షన్ దారుల్లో కనిపిస్తోంది. మొత్తానికి.. సర్కార్ తీరు.. అటు ఉద్యోగుల్లో.. ఇటు పెన్షన్ దారుల్లోనూ…టెన్షన్ పెంచుతోంది.