ఆంధ్రప్రదేశ్ సర్కార్.. ఆర్థిక సంక్షోభం అంచున ఉంది. పథకాలను అమలు చేయడానికి తేదీలు ప్రకటించారు. కానీ వాటిని అమలు చేయడానికి ప్రభుత్వం వద్ద నిధులు లేవు. రెండు నెలల కాలంలో చెల్లించాల్సిన నిధులకు…ఆదాయానికి మధ్య రూ. 12వేల కోట్ల లోటు ఏర్పడనుంది. మరో వైపు ఆదాయం పడిపోవడం.. ఆర్థిక శాఖ అధికారుల్ని ఆందోళనకు గురి చేస్తోంది. మాంద్యం ముప్పు భయపెడుతూండటంతో కేంద్రం కూడా అదనంగా ఒక్క రూపాయి కూడా ఇచ్చే అవకాశాలు లేవు.
ఏపీ ప్రభుత్వానికి పన్నులు, ఇతర గ్రాంట్ల రూపంలో నెలకు రూ. 8500 కోట్లు వస్తాయి. రుణాలు ఓ రూ. మూడు వేల కోట్లు తీసుకుంటారు. ఇలా మొత్తం నెలకు రూ. 11,500 కోట్లు అందుబాటులో ఉంటాయి. జీతాలు పిరఛన్లుకి 5000 కోట్లు, రుణాల తిరిగి చెల్లిరపులకు 2500 కోట్లు, సంక్షేమ పింఛన్లకు 1250 కోట్లు, విద్యుత్ సబ్సిడీకి 550 కోట్లు, బియ్యం సబ్సిడీకి 450 కోట్లు, ఆర్టీసీకి సాయం కిరద 250 కోట్లు కచ్చితంగా ఇవ్వాల్సి ఉంది. అంటే నికరంగా చూస్తే.. రూ. 1500 కోట్లు మాత్రమే ఉంటాయి. కానీ ఇవన్నీ.. వివిధ రకాల అభివృద్ధి పనుల బిల్లులు.. ఇతరాలకు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు వాటన్నింటినీ ప్రభుత్వం నిలుపుదల చేసింది.
జగన్ ప్రభుత్వం అమలు చేస్తామని ప్రకటించిన హామీల కింద.. ఈ నెలలో రూ. 8630 కోట్లు, అక్టోబర్‌కు రూ. 6,600 కోట్లు కావాల్సి ఉంటురది. రెండునెలల్లో అదనంగా రూ. 15,230 కోట్లు అదనపు భారం. సెప్టెంబర్‌లో ఇన్పుట్ సబ్సిడీ, తిత్లి తుపాను సాయం, పంట బీమా, వైఎస్ఆర్ బీమా, టాక్సీడ్రైవర్లకు సాయం, గ్రామ వాలంటీర్ల జీతాలు, అక్టోబర్ నెల్లో రైతు భరోసా, కేంద్రం పథకాలకు రాష్ట్ర వాటా చెల్లించాల్సి ఉంది. ఇప్పటికే అభివృద్ధి పనుల కోసం.. చెల్లించాల్సిన బిల్లుల బకాయిలు రూ. 20వేల కోట్ల వరకూ ఉన్నాయి. కేంద్ర ప్రాయోజిత నిధులతో నిర్వహిరచే పనులు, నాబార్డ్ పనులకు సంబంధిరచిన చెల్లిరపులు కూడా ఆగిపోయాయి. ఇప్పుడు.. ఆర్థిక పరిస్థితిని ఎలా మెరుగుపర్చుకుని.. రెండు నెలల్లో రూ. 15వేల కోట్లు ఎలా సంపాదించుకోవాలన్నదానిపై ఏపీ సర్కార్ పెద్దలకు ఎలాంటి మార్గం లేకుండా పోయింది. కొసమెరుపేమిటంటే… నెలకు రూ. 3వేల కోట్లు తెచ్చే అప్పులను కూడా లెక్క వేసిన తర్వాతే ఈ లోటు తేలింది. మరి.. ప్రైవేటు అప్పులకు వెళ్తారేమో చూడాలి..!