విధుల్లో చేరిన గ్రామ వాలంటీర్లకు.. మొదటగా అధికారులు చెప్పిన పని… పెన్షన్లు ఇవ్వడం.. బియ్యాన్ని డోర్ డెలవరీ చేయడం… ఇతర పథకాల లబ్దిదారులకు సేవలు అందించడం కాదు. వాటికి సమయం ఉంది కాబట్టి… ముందుగా… ప్రభుత్వం ప్రకటించిన ఓ కొత్త పథకానికి లబ్దిదారుల్ని ఎంపిక చేసే పని అప్పగించారు. వాలంటీర్లు తమకు కేటాయించిన ఇళ్లన్నీ తిరిగి ఆ పథకానికి లబ్దిదారులు ఉన్నారో లేదో సర్వే చేస్తున్నారు. ఈ పథకం… “పాస్టర్లకు.. రూ. ఐదు వేలు గౌరవ వేతనం ఇచ్చే పథకం..”. అసలు… పాస్టర్లు ఇలా ప్రజలు పన్నులు కట్టే డబ్బులు రూ. ఐదు వేలు ఇవ్వడమేమిటన్న చర్చ జరుగుతూండాగనే.. ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ మేరకు.. వాలంటీర్లతో లబ్దిదారుల ఎంపిక కోసం సర్వే ప్రారంభించింది. ఈ విషయం తెలిసి..బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ట్విట్టర్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
మత ప్రచారకులకు గౌరవవేతనం చెల్లించడం సరికాదని.. దీని గ్రామవాలంటీర్లతో ఈ సర్వే చేయించడం దారుణమని మండిపడ్డారు ప్రజాధనాన్ని మతపరంగా ఉపయోగించడాన్ని ఖండిస్తున్నామని ప్రజలను మతపరంగా విభజించి లబ్దిపొందాలని చూస్తోందని వైసీపీ సర్కార్ పై కన్నా మండిపడ్డారు. దేవాదాయశాఖకు హిందూ ఆలయాల ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది. వాటి నుంచే దేవాదాశాఖ ఉద్యోగులు, అర్చకులు.. ఇతరులకు జీతాలు చెల్లిస్తారు. అలాగే.. ముస్లింలకు సంబంధించి వక్ఫ్ బోర్డ్ ఉంటుంది. వక్ఫ్ బోర్డుకి కూడా.. భారీగా ఆస్తులు, ఆదాయం ఉన్నాయి. వక్ఫ్ బోర్డును ప్రభుత్వమే నియమిస్తుంది. ఆ బోర్డుకు ప్రభుత్వం ఇచ్చే నిధులు. వచ్చే ఆదాయంతో కలిసి.. ముస్లిం సంక్షేమానికి ఉపయోగిస్తారు. కానీ.. క్రిస్టియన్స్‌కు సంబంధించినంత వరకూ.. ఎలాంటి వ్యవస్థా.. ఆంధ్రప్రదేశ్‌లో లేదు. క్రిస్టియన్ సంస్థలు చాలా ఉన్నప్పటికీ.. వాటన్నింటితో ప్రభుత్వానికి సంబంధం ఉండదు.
ఈ క్రమంలో ప్రజల సొమ్మును.. పాస్టర్లుకు జీతాలు చెల్లించడం ఏమిటన్న చర్చ ప్రారంభమయింది. నిజానికి అర్చకులకు అయినా. మౌజమ్‌లకు అయినా. వారు ఆ స్థాయికి చేరుకోవాలంటే.. ఓ ప్రమాణం ఉంటుంది. కానీ.. పాస్టర్లకు మాత్రం.. అలాంటిదేమీ లేదు. అయినా ప్రభుత్వం ముందుకే వెళ్తోంది. ఇది మరింత వివాదాస్పదం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రభుత్వం స్వప్రయోజనాలే లక్ష్యంగా సమాజాన్ని,ప్రజలను మతపరంగా విభజించి లబ్దిపొందేందుకు ప్రజాధనాన్ని వినియోగించి మతప్రచారకులకు గౌరవవేతనం చెల్లించడం,గ్రామవాలంటీర్లతో ఈసర్వే చేయించడం చాలాదారుణం
ప్రజాస్వామ్య లౌకిక దేశంలో ప్రజాధనాన్ని మతపరంగా ఉపయోగించడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. pic.twitter.com/XDfQl1GmDJ
— Kanna Lakshmi Narayana (@KLNTDP) September 3, 2019