తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవిని… తమిళిసైకి గవర్నర్ పదవి ఇచ్చి ఖాళీ చేయించిన .. కమలం పెద్దలు.. ఆ స్థానంలో రజనీకాంత్ వస్తారనే ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ మేరకు.. తమిళనాడులో విస్తృత ప్రచారం జరుగుతోంది. రాజకీయ పార్టీ పెడతా..పెడతా అని ఊరిస్తూ వస్తున్న రజనీకాంత్‌ను.. తమిలనాడులో.. బీజేపీనే తన పార్టీగా చేసుకోవాలనే బంపర్ ఆఫర్లు.. మోడీ, అమిత్ షాల నుంచి వస్తున్నాయని చెబుతున్నారు. చాలా కాలంగా… రజనీకాంత్‌తో చర్చలు జరుపుతున్నారని… అందుకే.. ఇటీవలి కాలంలో… రజనీకాంత్ మోడీ, షాలపై అనూహ్యంగా పొగడ్తల వర్షం కురిపిస్తున్నారన్న చర్చ జరుగుతోంది.
తమిళనాడులో బీజేపీకి పట్టు చిక్కడం లేదు. అక్కడ ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఓ మాదిరిగా కూడా.. బలం పుంజుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు. అందుకే.. రజనీకాంత్ లాంటి మాస్ ఇమేజ్ ఉన్న నేతను చేర్చుకోవాలనే ప్రయత్నాలు చాలా కాలంగా సాగుతున్నాయి. ప్రస్తుతం తమిళనాడులో రాజకీయం మారింది. జయలలిత, కరుణానిధిలు లక్షల మంది అభిమానులు ఉన్న నేతలు. ప్రస్తుతం అలాంటి జనాకర్షణ ఉన్న నేతలు అటు అన్నాడీఎంకేకు కానీ.. ఇటు డీఎంకేకు కానీ లేరు. అయితే.. డీఎంకేకు స్టాలిన్ గట్టి నాయకుడిగా నిలబడ్డాడు. జయలలిత స్థాయిలో జనాకర్షణ కలిగి నేత రజనీకాంత్. అందుకే… బీజేపీ రజనీపై దృష్టి పెట్టిందని చెబుతున్నారు.
బీజేపీపై రజనీకాంత్ చాలా కాలంగా సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారు. కొన్నాళ్ల తరపున బీజేపీ తరపున ఎంపీగా పోటీచేసిన ఓ నేత.. తాను ఏర్పాటు చేసిన ఎంజీఆర్ విగ్రహం.. ఆవిష్కరణకు.. రజనీకాంత్ ను పిలిచారు. ఆ సభలో మాట్లాడుతూ రజనీకాంత్ మాట్లాడుతూ.. తాను ఎమ్జీఆర్ పాలన తెస్తానని రజనీకాంత్ ప్రకటించారు. స్టెరిలైట్ పరిశ్రమ కాల్పుల్లో మరణించిన వారిని పరామర్శించడానికి వెళ్లి.. బీజేపీకి మద్దతుగా మాట్లాడారు. తప్పు ఆందోళన కారులదే అన్నట్లుగా .. ప్రభుత్వానికి బహిరంగ మద్దతు తెలిపారు. ఈ క్రమంలో… తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నాటికి… బీజేపీని బలపర్చాలనుకుంటున్న హైకమాండ్.. రజనీకాంత్ పై గురి పెట్టిందంటున్నారు. మరి రజనీకాంత్‌నే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.