ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి గందరగోళంగా ఉంది. ఓ వైపు ఘోర పరాజయ భారం.. మరో వైపు కేసులు…మరో వైపు వైసీపీ నేతల దాడులతో.. నానా తంటాలు పడుతున్నారు. ఈ సమయంలో… తమను తాము రక్షించుకోవడానికైనా… కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో చేరాల్సిన పరిస్థితిలో చేరిపోయారు. ఈ క్రమంలో… కన్నీళ్లు పెట్టుకుని అయినా సరే.. టీడీపీకి రాజీనామా చేస్తున్న వాళ్లే ఎక్కువగా కనిపిస్తున్నారు. అలా కాకపోతే.. వీలైనంత వరకూ.. టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం తగ్గించుకుంటూ వస్తున్నారు. కానీ.. అనూహ్యం.. గత ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన ఓ వైసీపీ నేత మాత్రం… తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆయనే దొన్నుదొర. అరక నియోజకవర్గ వైసీపీ నేత.
గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ డిపాజిట్ కోల్పోయిన ఒకే ఒక్క నియోజకవర్గం అరకు. అక్కడ నుంచి పోటీ చేసిన.. కిడారి సర్వేశ్వరరావు కుమారుడు డిపాజిట్ తెచ్చుకోలేకపోయారు. వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. కానీ.. అక్కడ వైసీపీ తరపున టిక్కెట్ ఆశించిన… మరో నేత దొన్నుదొర… ఇండిపెండెంట్గా పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థికి గట్టి పోటీ ఇచ్చారు. రెండో స్థానంలో నిలిచారు. వైసీపీ గెలిచినప్పటికీ… తనకు టిక్కెట్ ఇవ్వని పార్టీలో ఉండకూడదని ఆయన అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా.. తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు.
అరకులో గిరిజనుల్లో.. దొన్నుదొరకు మంచి పట్టు ఉంది. కొణతాల రామకృష్ణ అనుచరునిగా.. 2014లో అరకు టిక్కెట్ ను కిడారి సర్వేశ్వరరావు దక్కించుకుని గెలిచారు. అయితే పార్టీలో నిరాదరణ ఎదురు కావడంతో.. ఆయన టీడీపీలో చేరి .. నక్సల్స్ చేతుల్లో హతమయ్యారు. ఆయన కుమారుడు…ఆరు నెలలు మంత్రిగా చేసినా.. నియోజకవర్గంలో పట్టు సాధించలేకపోయారు. అయితే.. వైసీపీలో మొదటి నుంచి దొన్నుదొర… అన్ని వర్గాలను కలుపుకుంటూ పని చేశారు. టిక్కెట్ దక్కకపోవడంతో.. ఇప్పుడు టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల్లో పరాజయం తర్వాత… దొన్నుదొర చేరికే.. టీడీపీలో మొదటిది.