‘సాహో’ హడావుడి అయిపోయింది. ఇప్పుడు ‘సైరా’ హంగామా మొదలవ్వబోతోంది. ఇప్పటికే సైరా టీజర్ బయటకు వచ్చేసింది. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 21న కర్నూలులో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించాలని చిత్రబృందం భావిస్తోంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రాయలసీమ వాసి. అందుకే రాయలసీమలోని ఓ ప్రాంతంలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించాలని చిత్రబృందం నిర్ణయించుకుంది. హైదరాబాద్, విశాఖపట్నంలలో కూడా `సైరా` కొన్ని ప్రచార కార్యక్రమాల్ని నిర్వహించబోతోంది. ఈలోగా పాటలు కూడా రాబోతున్నాయి. తొలుత `సైరా` టైటిల్ గీతాన్ని విడుదల చేయనున్నారు. ఈ పాటని సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించారు. ఈ పాటతోనే మ్యూజిక్ ఆల్బమ్ కి శ్రీకారం చుట్టబోతున్నారు. అమితాబ్ బచ్చన్‌ని ఈ సినిమా ప్రచారం కోసం తీసుకురావాలని చిరు భావిస్తున్నారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కర్నూలులో జరిగితే బిగ్ బీ రాకపోవొచ్చు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసే మరో వేడుకలో బిగ్ బీ పాల్లొనే అవకాశం ఉంది.