యాదాద్రి ఆలయంలో కేసీఆర్ శిల్పాలు, టీఆర్ఎస్ గుర్తు, ప్రభుత్వ పథకాల బొమ్ములు చెక్కడంపై.. చరిత్రలో నిలిచిపోయే వివరణ ఇచ్చారు వైటీడీఏ చైర్మన్ కిషన్ రావు, ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి. చరిత్ర గురించి… భావితరాలు తెలుసుకోవాలంటే.. అలా శిల్పాలు చెక్కడం కరెక్టేననన్నారు. శిల్పులకు ఎవరూ ప్రత్యేకంగా అలా చెక్కాలని ఆదేశాలివ్వలేదని… వారే.. కేసీఆర్ ను.. రాజుగా.. దేవుడిగా భావించి చెక్కించారని.. చెప్పుకొచ్చారు. అందులో ఎలాంటి వేరే ఉద్దేశం లేదన్నారు. వీరి వివరణ రాజకీయ పార్టీలకు మరింత ఆగ్రహాన్ని తెప్పించింది. బీజేపీ ఉద్యమానికి సిద్ధమయింది.
యాదాద్రి గుడిలో శిలలపై చెక్కిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కారు, తెలంగాణ పథకాల బొమ్మలు చెక్కడం రాజకీయ వివాదంగా మారింది. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోకపోతే రాజకీయ ఉద్యమం తప్పదని హెచ్చరిస్తున్నాయి. ఇలాంటి విషయాల్లో ముందుండే… బీజేపీ… రాజాసింగ్కు.. ఫుల్ చార్జ్ అప్పగించింది. ఆయన రంగంలోకి దిగిపోయారు. ప్రభుత్వం వెంటనే సంబంధిత అధికారుల పై చర్యలు తీసుకోవడం తో పాటు శిలలపై పై చెక్కిన బొమ్మలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో బీజేపీ కార్యకర్తలు చెక్కిన ప్రతిమలను తొలగించి తీరుతామని హెచ్చరిస్తున్నారు. స్వయంగా పెద్ద ఎత్తున అనుచరులతో కలిసి యాదాద్రి వెళ్లబోతున్నారు.
గుడి లో కేసీఆర్ , పార్టీ గుర్తులను మాత్రమే చెక్కారా..ఇంకా ఎవరెవరి ప్రతిమలు ఉన్నాయనేది పరిశీలించాక తదుపరి కార్యచరణ ప్రకటిస్తామని రాజాసింగ్ చెబుతున్నారు. యాదాద్రి గుడి లో చార్మినార్ ప్రతిమ వేసి హిందువులను కించపరచారని విమర్శించారు. .బీజేపీ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగనిస్తుందని ,హిందూ సాంస్కృతి ,సాంప్రదాయలపై కేసీఆర్ యుద్ధం ప్రకటించినట్లుగా ఆ పార్టీ చెబుతోంది. గతంలో హిందూ గాళ్ళా.. బొందూ గాళ్లా అని హిందువుల మనోభావాలు దెబ్బతీశారని బీజేపీ గుర్తు చేస్తోంది. ఇప్పుడు యాదాద్రి లో అన్యమత శిల్పాలు చెక్కి హిందువుల వ్యతిరేకిగా కేసీఆర్ వ్యవహరిస్తున్నాడని విమర్శిస్తున్నారని బీజేపీ విమర్శలు ప్రారంభించింది.