ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నియామకానికి రంగం సిద్ధం చేసింది. లోకాయుక్తగా… హైకోర్టులో పన్నెండేళ్ల క్రితం .. న్యాయమూర్తిగా వ్యవహరించి.. ఆ తర్వాత జన విజ్ఞాన వేదిక పేరుతో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా… మాట్లాడుతూ.. ఇతర పార్టీలపై.. ఆరోపణలు చేస్తూ ఉండే.. మాజీ న్యాయమూర్తి పి.లక్ష్మణ్ రెడ్డిని నియమించడానికి రంగం సిద్దం చేసింది. ఈ మేరకు ఏపీ చీఫ్ జస్టిస్ ఆమోద ముద్ర వేశారని సాక్షి పత్రిక ప్రకటించేసింది. మాజీ న్యాయమూర్తి లక్ష్మణ్ రెడ్డిని లోకాయుక్తగా నియమించాలని ఏపీ సర్కార్ ముందుగానే ప్రణాళికలు వేసుకున్నట్లుగా … తొలి అసెంబ్లీ సమావేశాల్లో చట్టాన్ని సవరించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తుల కొరత ఉన్నందున వీరి స్థానంలో హైకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులను లోకాయుక్తగా నియమించుకోవడం కోసం చట్ట సవరణ అవసరమని అసెంబ్లీలో ప్రభుత్వం చెప్పుకొచ్చింది.
రిటైర్డ్ న్యాయమూర్తులు అందుబాటులో ఉన్నందున లోకాయుక్త నియామకానికి ఇబ్బంది ఉండదనే సదుద్దేశంతో చట్ట సవరణ చేస్తున్నామని ప్రభుత్వం అసెంబ్లీకి తెలిపింది. ఐదేళ్లుగా జరిగిన లోటుపాట్లపై లోకాయుక్త విచారిస్తుందని కూజా అసెంబ్లీలో ప్రకటించింది. ప్రభుత్వం చట్ట సవరణ చేసి.. మాజీ న్యాయమూర్తి లక్ష్మణ్ రెడ్డి పేరును… చీఫ్ జస్టిస్ వద్దకు పంపినట్లుగా తెలుస్తోంది. దానికి చీఫ్ జస్టిస్ ఆమోద ముద్ర వేశారని.. కూడా సాక్షి పత్రిక ప్రకటించింది. న్యాయమూర్తిగా రిటైరైన తర్వాత లక్ష్మణ్ రెడ్డి.. జన విజ్ఞాన వేదిక పేరుతో.. రాజకీయ కార్యకలాపాలు కొనసాగించారు. గత ఐదేళ్ల కాలంలో ఏపీలో .. ఉన్న ప్రభుత్వంపై… ఆధారాలు లేకుండా ఆయన అనేక ఆరోపణలు చేశారు. ఆయన సాక్షి పత్రిక.. టీవీ చానళ్లలో తప్ప ఎక్కడా కనిపించేవారు కాదు. సాక్షి పత్రికలో… వచ్చిన ఆరోపణల్నే ఆయన చేసేవారు. రాయలసీమను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్న ఉద్యమాలు కూడా నడిపారు.
ఈ క్రమంలో… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా అనుబంధంగా వ్యవహరించిన .. మాజీ న్యాయమూర్తిని… చట్టాన్ని సవరించి మరీ లోకాయుక్తగా నియమిస్తూండటంపై.. రాజకీయ వర్గాల్లోనే కాదు.. న్యాయవాద వర్గాల్లోనూ విస్మయం వ్యక్తం అవుతోంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఉండే అధికారాలన్నీ ఉన్న లోకాయుక్త పోస్టును … జనవజ్ఞాన వేదిక పేరుతో .. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు, ప్రకటనలు చేసిన వారికి ఇవ్వబోతూండటం… విస్మయపరుస్తోంది.