గవర్నర్ నరసింహన్ హైదరాబాద్ నుంచి శాశ్వతంగా చెన్నైకు వెళ్లిపోయారు. ఆయన గవర్నర్ పదవీ కాలం ముగిసింది. రేపు కొత్త గవర్నర్ గా తమిళిసై ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో… ఈ రోజే.. రాజ్‌భవన్‌కు వీడ్కోలు పలికారు. బేగంపేట్ ఎయిర్‌పోర్టులో సీఎం కేసీఆర్ ఘనంగా వీడ్కోలు పలికారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నేతలు ఎయిర్‌పోర్టుకు వచ్చారు. నరసింహన్ ప్రత్యేక విమానం వెళ్లేవరకూ సీఎం కేసీఆర్ అక్కడే నిలబడ్డారు. అంతకు ముందు ప్రగతిభవన్‌లో నరసింహన్ వీడ్కోలు సభ జరిగింది. ఆ సభలో పాత సంగతులన్నిటినీ… కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. నరసింహన్ నన్ను అన్నలా ఆదరించాని .. పెద్దదిక్కులా, రాష్ట్రానికి మార్గదర్శకుడిగా వ్యవహరించారని గుర్తు చేసుకున్నారు. మొదట్లో నరసింహన్ వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని అణచివేయడానికే వచ్చారనే భయం ఉండేదిదన్నారు. అయితే నరసింహన్‌ను కలిసి ఉద్యమ నేపథ్యాన్ని వివరించానన్నారు.నరసింహన్ గవర్నర్‌గా ఉన్న సమయంలోనే తెలంగాణ వచ్చిందని.. టీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలోకి వచ్చిందని గుర్తు చేసుకున్నారు.
ఎప్పుడైనా కొంచెం బాధపడినా వెన్ను తట్టి ధైర్యం చెప్పేవారని … రాజ్ భవన్ వెళ్లిన ప్రతీసారి ఎంతో ఆత్మీయంగా మాట్లాడేవారని కేసీఆర్ గవర్నర్ తీరును మనస్ఫూర్తిగా వివరించారు. రాజ్‌భవన్‌లో నరసింహన్ దంపతులు ప్రతీ పండుగను గొప్పగా నిర్వహించేవారని.. ఇప్పుడా నోరూరించే రుచులకు దూరం అవుతున్నానని చలోక్తి విసిరారు. యాదాద్రి పనులు పూర్తయ్యాక నరసింహన్ మళ్లీ రావాలి..పూజలో పాల్గొనాలని ఆహ్వానించారు. నరసింహన్ చూపిన ప్రేమ, అభిమానం జీవితాంతం గుర్తుండిపోతాయన్నారు. గవర్నర్ కూడా.. కేసీఆర్ పై అదే తరహా ప్రేమాభిమానాలు చూపించారు.
గవర్నర్‌గా వచ్చిన కొత్తలో అన్ని విధాలా సహకరిస్తామని.. ఉద్యమ నాయకుడిగా ఉన్నప్పుడే కేసీఆర్ మాటిచ్చారు..నిలబెట్టుకున్నారని ప్రశంసించారు. కేసీఆర్ తీసుకొచ్చిన అనేక పథకాల్లో మానవత్వం ఉందని .. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన పథకాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని అభినందించారు. సీఎం పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను ప్రధానికి కూడా వివరించానని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్‌కు ప్రజల నాడి తెలుసు కాబట్టే మంచి పథకాలు తేగలిగారని .. కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ కల సాకారం కావాలని నరసింహన్ ఆకాంక్షించారు. వీడ్కోలు సభ, బేగంపేట విమానాశ్రయాల్లో భావోగ్వేద పరిస్థితులు కనిపించాయి.