వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ.. రేమండ్ పీటర్ అనే ఓ అధికారి నేతృత్వంలో ఓ నిపుణుల కమిటీని జగన్ నియమించారు. ఈ రేమండ్ పీటర్ … జగన్ బంధువని దేవినేని ఉమ ప్రెస్మీట్ పెట్టినప్పుడల్లా ఆరోపిస్తూ ఉంటారు. ఈ రేమండ్ పీటర్.. పోలవరంపై చకా చకా.. పరిశీలన జరిపి… రూ. మూడు వేల కోట్ల అవినీతి జరిగిందని నివేదిక ఇచ్చేశారు. వెంటనే… ఈ నివేదిక ఆధారంగా.. నవయుగ టెండర్లు రద్దు చేశారు. రివర్స్ టెండరింగ్ కు వెళ్లారు. కేంద్రం వద్దంటున్నా… ముందుకే వెళ్తున్నారు. ఈ క్రమంలో.. తమ వాదన ఢిల్లీలో వినిపించుకోవడానికి… పీఎంవోలో… అమిత్ షాకు కూడా… ఈ రేమండ్ పీటర్ నివేదికను ఇచ్చారు. అక్కడే… ఏపీ ప్రభుత్వానికి కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి.
ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్ అమిత్ షా, గజేంద్రసింగ్ షెకావత్ ను కలిసి పోలవరంపై నిపుణుల కమిటీ నివేదికను సమర్పించారు. అంతకు ముందు విజయసాయిరెడ్డిని పీఎంవో పిలిచి వివరణ అడిగినప్పుడూ అదే నివేదిక ఇచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ ్ధారిటీ, కేంద్ర జలసంఘం గతంలో ఇచ్చిన నివేదికలకు అది పూర్తి భిన్నంగా ఉంది. దాంతో.., ప్రధానమంత్రి కార్యాలయం… వివరణ అడిగింది. జగన్, విజయసాయిరెడ్డి ఇచ్చిన నివేదికలో ఉన్న అంశాలపై పూర్తి వివరణ అడిగింది. ప్రధానమంత్రి కార్యాలయం ముఖ్య కార్యదర్శి నృపేంద్రమిశ్రా… ఈ మేరకు… ఆధారాలు కూడా అడగాలని.. కేంద్ర జలశక్తి కార్యదర్శికి లేఖ రాశారు.
ప్రధానమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలతో పోలవరంం ప్రాజెక్ట్ అధారిటీని నివేదికలో ఉన్న అంశాలపై కేంద్ర జలశక్తి కార్యదర్శి వివరణ కోరారు. వెంటనే… సీఎం జగన్… సమర్పించిన నివేదికపై పూర్తిస్థాయిలో వివరణ పంపించాలని ఏపీ జలవనరుల శాఖను పోలవరం ప్రాజెక్ట్ అధారిటీ ఆదేశించింది. ఇది జరిగి చాలా కాలం అయింది. రేమండ్ పీటర్ నివేదికలో చెప్పిన ప్రతీ ఆంశానికి ప్రాతిపదిక, ఆధారం ఏమిటో చెప్పాలని అడిగితే… జగన్ సర్కార్ సైలెంటయింది. మూడో తేదీలోపు సమాధానం పంపాల్సి ఉన్నా పంపలేదు. మరింత సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినట్టు ప్రచారం జరుగుతోంది. పీటర్ కమిటీ నివేదికను అడ్డం పెట్టుకునే జగన్… పోలవరం పై ముందుకెళ్తున్నారు. ఇప్పుడా కమిటీ నివేదికలో పేర్కొన్న అంశాలపై ఆధారాలు లేకపోతే సీరియస్ అయ్యే అవకాశం ఉంది. ఇదే ఇప్పుడు… ఏపీ సర్కార్ కు ఇబ్బందికరంగా మారింది.