జగన్ పాలన వంద రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆ పాలన పై అటు వైకాపా తరపున పాజిటివ్ విశ్లేషణలు, ఇటు విపక్షాల నుండి నెగెటివ్ విశ్లేషణలు వెలువడుతున్నాయి. అయితే, జగన్ మీద జరిగిన దాడి కేసులో, బాబాయి వివేకానంద రెడ్డి హత్య కేసులో పురోగతి లేకపోవడం మీద పలు సందేహాలు విపక్షాల నుండి మాత్రమే కాక సామాన్య ప్రజల నుండి కూడా వినిపిస్తున్నాయి.
ఇదే విషయంపై సెటైర్స్ వేశారు మాజీ మంత్రి నారా లోకేష్. లోకేష్ ట్వీట్ చేస్తూ, ” కోడి కత్తి వెనుక మహాకుట్ర ఉంది, సీబీఐ విచారణ చేపట్టాలని టీవీల్లో అరిచిన గ్యాంగ్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంది? నిందితుడు జైల్లోనే ప్రాణహాని ఉంది అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? సీబీఐకి కేసు అప్పగిస్తే నిజాలు బయటపడి జీవితాంతం శుక్రవారం కోర్టుకి వెళ్లాల్సివస్తుందని భయమా?” అని వ్రాసుకొచ్చారు. ప్రజల లో కూడా, అప్పట్లో జగన్, మరియు ఇతర వైకాపా నాయకులు ఆరోపించినట్లు, నిజం గా ఇది అప్పటి అధికార పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ నేత లు పని అయి ఉంటే, స్వయం గా తన మీద జరిగిన దాడి కేసులో జగన్ వంద రోజుల పాలన లో ఖచ్చితంగా పురోగతి ఉండేదనే అభిప్రాయం ఏర్పడింది.
మరి జగన్ పాలన పూర్తి అయ్యేలోపు అయినా ఈ కత్తి దాడి కేసులో పురోగతి ఉంటుందా అన్నది వేచి చూడాలి.
కోడికత్తి వెనుక మహాకుట్ర ఉంది, సీబీఐ విచారణ చేపట్టాలని టీవీల్లో అరిచిన గ్యాంగ్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉంది? నిందితుడు జైల్లోనే ప్రాణహాని ఉంది అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? సీబీఐకి కేసు అప్పగిస్తే నిజాలు బయటపడి జీవితాంతం శుక్రవారం కోర్టుకి వెళ్లాల్సివస్తుందని భయమా?#WhoKilledBabai
— Lokesh Nara (@naralokesh) September 8, 2019