జనసేన అధినేత పవన్ కల్యాణ్.. యూరేనియం సమస్యపై దృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజాపోరాటాలపై మక్కువ చూపే జగన్… యూరేనియం విషయంలో.. ఎక్కువగా నష్టపోయేది.. అడవుల్లో ఉండే గిరిజనులు, పర్యావరణమే కాబట్టి… ఈ విషయంలో ఆయన కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కడప జిల్లాలో ఉన్న యూనియం ప్లాంట్ తో… పులివెందుల నియోజకవర్గ ప్రజల కాలుష్యం బారిన పడ్డారు. తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే.. నల్లమలలో యూరేనియం తవ్వకాలకు కేంద్రం. గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో… దీనికి సంబంధించిన సమాచారాన్ని పవన్ కల్యాణ్ సేకరిస్తున్నట్లుగా సమాచారం. ఈ విషయంపై… మాట్లాడేందుకు.. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ అడగగానే పవన్ కల్యాణ్ అపాయింట్ మెంట్ ఇచ్చారు.
యూరేనియం తవ్వకాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణ పరిధిలో ఉన్న నల్లమల అడవుల్లో యూరేనియం తవ్వకాలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. తెలంగాణ సర్కార్ ఎన్వోసీ జారీ చేసింది. దీనిపై.. కాంగ్రెస్ పార్టీ ఉద్యమానికి సిద్ధమయింది. రేవంత్ రెడ్డి లాంటి వాళ్లు నల్లమలలో పర్యటించి వచ్చారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్.. యూరేనియం మీదనే వర్కవుట్ చేస్తున్నారు. వారానికి మూడు రోజులు ప్రెస్ మీట్లు పెట్టి హడావుడి చేస్తున్నారు. త్వరలో ఓ వర్క్ షాప్ ను.. రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దానికి .. ప్రముఖుల్ని పిలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో.. పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటంలో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు.
పవన్ కల్యాణ్ పార్టీ విధానంలోనే పర్యావరణం ఉంది. పర్యావరణానికి హాని కలిగితే.. ఎంతకైనా పోరాడతామని పవన్ కల్యాణ్ చెబుతూంటారు. ఈ క్రమంలో యూరేనియం తవ్వకాలపై పోరాటానికే పవన్ కల్యాణ్ ఎక్కువగా ఆసక్తి చూపే అవకాశాలు ఉన్నాయి. త్వరలో కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి.