వరద నీటి నిర్వహణలో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం అత్యంత ఘోర వైఫల్యం మరోసారి బయటపడింది. ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద వస్తున్నప్పటికీ.. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి దిగువకు వదలడంలో.. తీవ్ర నిర్లక్ష్యం వహించారు. డ్యామ్ భద్రతను గాలికి వదిలేసి.. ఎవరి దారిన వాళ్లు పోవడంతో… మంగళవారం తెల్లవారుజామున.. డ్యామ్ మొత్తం నిండిపోయి.. ఎగువ నుంచి నీరు కిందకు పొంగిపోయింది. ఈ పరిస్థితి అత్యంత ప్రమాదకరం. ఎగువ నుంచి ఎంత వరద వస్తుందో.. స్పష్టమైన సమాచరం అధికారులకు ఎప్పటికప్పుడు అందింది. అదే సమయంలో.. శ్రీశైలం ప్రాజెక్టుతో పాటు.. దిగువ ప్రాజెక్టుల్లో ఎంతెంత నీరు నిల్వ ఉందో స్పష్టంగా తెలుసు. అలాంటి సమయంలో… సమర్థంగా నీటి నిర్వహణ చేపట్టాల్సిన అధికారులు.. డ్యామ్ ను గాలికొదిలేశారు.
సోమవారం.. భారీగా వరద వస్తుందని తెలిసినప్పటికీ.. నాలుగు గేట్లు.. చాలా స్వల్పంగా ఎత్తిన అధికారులు.. ఆ తర్వాత అడ్రస్ లేకుండాపోయారు. ఆ గేట్లను కూడా… శ్రీశైలం డ్యామ్ ఎస్ఈ కాకుండా.. ఆయన భార్య తో ఓపెన్ చేయించారు. ఇదే పెద్ద వివాదం అనుకుంటే.. ఆ తర్వాత .. అసలు పట్టించుకోవడం మానేశారు. ఫలితంగా.. రాత్రికి.. కిందకు వదులుతున్న నీరు కన్నా… డ్యామ్‌లోకి వచ్చి చేరే నీరే అధికంగా ఉండటంతో.. ప్రాజెక్టు పై నుంచి నీరు పొంగి పొర్లడం ప్రారంభమయింది. విషయం మీడియాలో రావడంతో.. ఉన్నతాధికారులు హుటాహుటిన డ్యామ్ వద్దకు వచ్చి పది గేట్లు ఎత్తి… ప్రస్తుతానికి.. ప్రమాదం నుంచి బయటపడేశారు.
అయితే.. జలవనరుల శాఖ అధికారులు మాత్రం.. భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. ఎంత నీరు వస్తున్నాయో… జలవనరుల శాఖకు సమాచారం వస్తుందని… వారు చెప్పిన మేర మాత్రమే.. తాము గేట్లు ఎత్తుతామని… అధికారులు చెబుతున్నారు. ఆ ప్రకారమే.. పై నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే.. తాము నీటి విడుదలకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాము కానీ.. సొంత నిర్ణయాలు కాదంటున్నారు. ఈ క్రమంలో… శ్రీశైలం డ్రామ్ .. ప్రమాదం ప్రమాదంలో పడిందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రాజెక్టు పై నుంచి నీరు పొంగిపోయే పరిస్థితి వస్తే.. జరిగే పరిణామాలు ఊహించలేమంటున్నారు.