భారత రాజకీయాల్లో ఇక నుంచి ప్రాంతీయ పార్టీలకు మనుగడ లేదని గుర్తించే… భారతీయ జనతా పార్టీలో చేరినట్లుగా… ఎంపీ సీఎం రమేష్ ప్రకటించుకున్నారు. బీజేపీలో చేరిన రెండున్నర నెలల తర్వాత తొలి సారి ఆయన మీడియాతో మాట్లాడారు. తాను భారతీయ జనతా పార్టీలో చేరడానికి… కారణాన్ని చెప్పుకొచ్చారు. మూడేళ్లలో జమిలీ ఎన్నికలు జరుగుతాయని మాత్రం. సీఎం రమేష్ గట్టిగా చెబుతున్నారు. భారతీయ జనతా పార్టీ తరపున ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు సుజనాతో పాటు.. సీఎం రమేష్ కూడా రెడీ అయ్యారు. బీజేపీలో చేరిన తర్వాత సీఎం రమేష్… మీడియా ముందుకు రాకపోయినప్పటికీ.. బీజేపీ తరపున మాత్రం.. తెర వెనుక రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారు.
పార్లమెంట్ జరిగేటప్పుడు.. మరింత యాక్టివ్ గా ఉంటున్నారు. రాజ్యసభలో బిల్లులను పాస్ చేసే విషయంలో… సభ్యుల మద్దతు కూడగట్టగడంలో.. తన టాలెంట్ మొత్తం చూపిస్తున్నారు. ఈ క్రమంలో… ఏపీలో బీజేపీని బలోపేతం చేసే దిశగా… తెర వెనుక వ్యూహాలకు … సీఎం రమేష్ ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. భవిష్యత్ ప్రణాళికలపై… బీజేపీ హైకమాండ్ నుంచి స్పష్టమైన సమాచారం ఉండటంతోనే… సీఎం రమేష్.. ముందస్తు ఎన్నికల గురించి చెబుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. బీజేపీ కూడా.. జమిలీ ఎన్నికల నిర్వహణకు పట్టుదలగా ఉంది.
రెండో సారి ఎన్నికల్లో గెలిచిన వెంటనే.. అన్ని పార్టీల సమావేశం పెట్టిన ప్రధాని మోడీ.. ఈ మేరకు అంగీకారం కూడా తీసుకున్నారు. ఆగస్టు పదిహేను ప్రసంగంలోనూ.. వన్ నేషన్ – వన్ ఎలక్షన్ విధానాన్ని గట్టిగానే ప్రస్తావించారు. దీంతో.. జమిలీ ఎన్నికలు ఖాయమనే అభిప్రాయం అందరికీ వచ్చింది. అయితే. ఎప్పుడనేదానిపైనే స్పష్టత లేదు. కొసమెరుపేమిటంటే.. గుంటూరులో వైసీపీ బాధితుల పునరావాస శిబిరంలో మాట్లాడిన… చంద్రబాబు కూడా.. మూడేళ్లలో… జమిలీ ఎన్నికలు వస్తాయని ప్రకటించారు.