నవరత్నాల అమలు… మేనిఫెస్టోలో చెప్పిన విషయాలు.. పథకాలు ఎప్పుడెప్పుడు అమలు చేస్తామో… ఓ క్యాలెండర్ ప్రకటించిన ప్రభుత్వం… మొదటి పథకం అమలును వాయిదా వేసింది. సెప్టెంబర్ నెలాఖరులో… ఆటో, క్యాబ్ ఓనర్ కం డ్రైవర్లకు రూ. పదివేలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం అధికారికంగా క్యాలెండర్ విడుదల చేసింది. కానీ ఇప్పుడు మాట మార్చారు. వచ్చే నెల నాలుగో తేదీన సాయం చేస్తామని చెబుతున్నారు. నిజానికి లబ్దిదారుల ఎంపిక కూడా.. ఇంకా ప్రారంభం కాలేదు. మూడు రోజుల కిందటే… ఆన్ లైన్లో.. డ్రైవర్ కం ఓనర్లు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పుకొచ్చారు కానీ.. ఎలాంటి ఏర్పాట్లూ చేయలేదు. పధ్నాలుగో తేదీ నుంచి చేసుకోవచ్చని తాజాగా చెబుతున్నారు. సీఎం వద్ద జరిగిన సమీక్షలో… ఈ పథకానికి నిధులు వచ్చే నెల నాలుగో తేదీన ఇద్దామని ప్రతిపాదించారు.
రవాణా శాఖ లెక్కల ప్రకారం… ఏపీలో దాదాపుగా ఏడు లక్షల ఆటోలు, ట్యాక్సీలు ఉన్నాయి. అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. దరాఖాస్తులను పరిశీలించి.. వార్డు, గ్రామ వాంటీలర్ల ద్వారా వెరీఫై చేయిస్తారు. ఓకే అయిన తర్వాత నగదును…లబ్దిదారుల అకౌంట్లో వేస్తారు. దీనికి చాలా సమయం పడుతుంది. డ్రైవర్ కమ్ ఓనర్ అయితేనే… ప్రభుత్వం అందించే లబ్ది చేకూరనుంది. బండి కొని టాక్సులు కట్టి.. వేరే డ్రైవర్‌కు అద్దెకు ఇచ్చే వారికి ఈ పథకం వర్తించదు. అలాగే డ్రైవర్లు ఇతరుల వద్ద పని చేస్తున్నా.. ఈ పథకం వర్తించదు. కచ్చితంగా.. ఆటో డ్రైవర్ అయితే.. ఆ ఆటోను.. ఓనరే స్వయంగా నడుపుకోవాలి… కారు డ్రైవర్ అయితే.. స్వయంగా కారు డ్రైవరే నడుపుకోవాలి. లేకపోతే.. ఈ పథకం వర్తించదు. భార్య, భర్తలకు విడివిడిగా ఆటో లేదా ట్యాక్సీలు ఉండి నడుపుకుంటున్నా ఒక్కరికే పథకం వర్తిస్తుంది.
నిబంధనల పేరుతో వీలైనంత మందిని… తొలగించి.. అరకొర మందికి ఇస్తే… దాని వల్ల నష్టమే ఎక్కువ జరుగుతుంది. కొంత మందికి వచ్చి కొంత మందికి రాకపోతే.. అది తీవ్రమైన వ్యతిరేకతకు.. దారి తీస్తుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం గుర్తించి.. రవాశాఖ శాఖ రికార్డుల్లో ఉన్న ఆటో, క్యాబ్ ఓనర్లు, డ్రైవర్లు అందరికీ ఇవ్వాలన్న విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు పథకానికి నిధుల కొరత పట్టి పీడిస్తోంది. ప్రభుత్వం వద్ద తగినన్ని నిధులు లేవు. రైతు భరోసాకు.. ఆక్టోబర్ పదిహేనో తేదీన… ఒక్కో రైతుకు రూ. 12500 ఇవ్వాల్సి ఉంది. 40 లక్షలకుపైగా రైతులు ఉన్నారు. వీటన్నింటికీ నిధులు సమకూర్చడానికి ప్రభుత్వం తంటాలు పడుతోంది.