ఆర్.ఎక్స్ 100తో కెరటంలా ఉవ్వెత్తున లేచింది పాయల్ రాజ్‌పుత్. ఆ తరవాత ఆమెకు మంచి అవకాశాలే వచ్చాయి. వెంకటేష్, రవితేజ సినిమాల్లో కథానాయికగా ఓకే అయ్యింది. లేడీ ఓరియెంటెడ్ సినిమా `ఆర్డిఎక్స్ లవ్`లో నటించింది. ఈసినిమా కోసం పాయల్ ఫైటింగులూ చేసింది. ఇప్పుడు మరో మంచి ఆఫర్ పాయల్ని వెదుక్కుంటూ వెళ్లింది. తేజ దర్శకత్వం వహించే ఓ లేడీ ఓరియంటెట్ సినిమాలో పాయల్‌కి ఛాన్సొచ్చినట్టు తెలుస్తోంది. తేజ `సీత`లో పాయల్ ఓ ఐటెమ్ గీతంలో నర్తించింది. ఇప్పుడు తననే తేజ హీరోయిన్గా ఎంచుకున్నాడు. తేజ సినిమాలన్నీ ఎమోషనల్ డ్రైవ్‌తో సాగుతాయి. తన కథలోని పాత్రకు పాయల్ అయితే బాగుంటుందని భావిస్తున్నార్ట. త్వరలోనే ఈ కాంబోపై ఓ అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నాయి.