ఆంధ్రప్రదేశ్లో విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసే దిశగా.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా.. ఆయన విద్యావ్యవస్థను ప్రక్షాళించాలని… పట్టుదలతో ఉన్నారు. మౌలిక సదుపాయాలు మాత్రమే కాకుండా..అన్నింటికి మించి… ఉపాధ్యాయ శక్తిని పెంచాలనుకుంటున్నారు. స్కూళ్లలో… వంద మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉండే పరిస్థితి లేదు. అందుకే.. ఈ పరిస్థితిని మార్చడానికి ప్రతి 30 మందికి ఒక టీచర్ ను నియమించాలని నిర్ణయించారు. విద్యాహక్కు చట్టం ప్రకారం.. ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 30మందికి ఒకరు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల్లో ప్రతి 35మంది విద్యార్థులకు ఒకరు చొప్పున టీచర్ ఉండాలి. దీన్ని కచ్చితంగా అమలు చేయాలని జగన్ నిర్ణయించారు.
విద్యార్థులు – టీచర్ల నిష్పత్తిని పాటించాలంటే… పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. ఇందు కోసం యాభై వేల మందికిపైగా కొత్తగా టీచర్లను విధుల్లోకి తీసుకోవాల్సి ఉంటుందని అంచనా. ఈ మేరకు జనవరిలో డీఎస్సీ విడుదల చేసే అవకాశం ఉంది. ఒక్క ఏడాది కాదు.. ప్రతీ ఏటా.. ఉపాధ్యాయ ఖాళీల భర్తీ ప్రక్రియను ఏటా జనవరి నుంచి ప్రారంభించాలని సీఎం జగన్ ఆదేశించారు. దీని జనవరిలో కొత్త డీఎస్సీ-2020 నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ ఏడాది డిసెంబరు 31నాటికి ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను దానిద్వారా భర్తీ చేస్తారు. ఏప్రిల్, మే నెలల్లో రాత పరీక్షలు నిర్వహించి.. స్కూళ్లు తెలిచే సమయానికి నియామకపత్రాలిస్తారు.
ఇకపై ప్రతి సంవత్సరం ఇదే పద్ధతిలో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని జగన్ ననిర్ణయం తీసుకున్నారు. టీచర్లను పెంచితే దీనిద్వారా సర్కారీ స్కూళ్లలో అడ్మిషన్లు పెరుగుతాయని దగన్ అంచనా వేస్తున్నారు. అయితే.. ఇప్పటికే… గత సర్కార్… డీఎస్సీ-2018 నోటిఫికేషన్ పరీక్షలు నిర్వహించింది. ఆ ఫలితాలు ఇంత వరకూ విడుదల చేయలేదు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతే స్కూళ్లు ప్రారంభమయ్యాయి. అయినప్పటికీ.. ఆ ఫలితాలను ఇప్పటికీ పెండింగ్లోనే ఉంచారు. ముందుగా ఆ ఫలితాలను ప్రకటించి.. కొత్త టీచర్లను.. విద్యార్థులకు అందుబాటులోకి తేవాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.