రాయలసీమపై భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. కడపలో ఉన్న కీలకమైన సమస్యలపై తాము పోరాటం చేసి…వాటి కేంద్రం ద్వారా పరిష్కారాలు చూపించి… ప్రజల మద్దతు కూడగట్టుకోవాలని నిర్ణయించుకుంది. కడపలో… ఆ పార్టీకి చెందిన కీలక నేతలంతా రహస్యంగా సమావేశమయ్యారు. కడప స్టీల్ ప్లాంట్ సహా…. కర్నూలులో హైకోర్టుతో పాటు..గతంలో ప్రకటించిన సీమ డిక్లేషన్లోని పలు అంశాలతో.. ప్రజల్లోకి వెళ్తే… బీజేపీ పట్ల ఆదరణ పెంచుకోవచ్చని భావిస్తున్నారు. ఎలాగూ పార్టీలో నాయకుల చేరికపై ఇప్పటికే ఓ స్థాయిలో కసరత్తు జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ నుండి సీఎం రమేష్‌ను చేర్చుకున్న తర్వాత.. ముఖ్యమైన నాయకుల వేట ప్రారంభించింది. భద్రతా భయం ఉన్న నేతలను ముందస్తుగా చేర్చుకునేందుకు కావాల్సినంత కసరత్తు చేసింది. పార్టీ హైకమాండ్ ఆలోచనలు…వ్యూహాలను ఎప్పటికప్పుడు దిగుమతి చేస్తోంది.
జమ్మల మడుగు నేత ఆదినారాయణ రెడ్డి… బీజేపీలో చేరనున్న నేపధ్యంలో…. ఒకే సారి భారీ చేరికలకు ప్రణాళికలను సిద్దం చేసుకునే దిశగా.. ఏర్పాట్లు చేసుకుందామనే ఆలోచన చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రాయలసీమ టీడీపీ నేతలకు. బీజేపీ నుంచి ఆఫర్లు రావడం ప్రారంభమయింది. వ్యాపారాలు.. ఉన్న నేతల్ని ముందుగా టార్గెట్ చేసుకుని ఆర్థిక ప్రయోజనాల అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. కొంత మంది బీజేపీలో చేరేందుకు సుముఖంగా ఉన్నారు. అయితే… షరతులతో కాకుండా.. పదవుల హామీతో చేరాలని అనుకుంటున్నారు. మరికొందరు ఆర్థిక ప్రయోజనాలను ఆశిస్తున్నారు. మరికొంత మంది… కేసులు. ఇతర ఇబ్బందులు ఉండనే ఉన్నాయి. ఈ క్రమంలో కలసి వచ్చే వారినందర్నీ ఎలా పార్టీలో చేర్చుకుని బలపడాలనే అంశంపై పార్టీ నేతల మధ్య కడపలో చర్చ జరిగింది.
ఆంధ్రలో కంటే.. రాయలసీమలో బలం పెంచుకోవడానికి తమకు ఎక్కువ స్కోప్ ఉందన్నట్లుగా.. బీజేపీ నేతల శైలి ఉంది. అక్కడి వెనుకబాటు తనాన్ని .. హైలెట్ చేస్తూ.. తామే న్యాయం చేస్తామని ప్రజల్లోకి వెళ్లడం ద్వారా.. బలపడవచ్చని భావిస్తున్నారు. అదే సమయంలో.. టీడీపీ నేతలు ఎలాగూ తమతో కలుస్తారు కాబట్టి… ఢోకా ఉండదని భావిస్తున్నారు. అయితే… రాయలసీమ డిక్లరేషన్ పేరుతో ఉద్యమం ప్రారంభిస్తే.. అది ఏపీలో ఇబ్బందికరం అవుతుందన్న అంచనా ఆ పార్టీలో ఉంది.