వైసీపీలోని కాపు నేతలకు జగన్ అంటే భయం..! .. అంటూ.. పవన్ కల్యాణ్ చేసిన ఒకే ఒక్క విమర్శ… ఆ పార్టీలోని… కాపు నేతలందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. ఆ మాకేం భయం అంటూ.. ఒక్కొక్కరు తెర ముందుకు వస్తున్నారు. పవన్ కల్యాణ్ ఆ వ్యాఖ్యలు చేసినప్పుడు సైలెంట్ గా ఉన్న నేతలందరూ.. తర్వాత ఆదేశాలు వచ్చినట్లుగా.. ఒక్కొక్కరు.. ఎక్కడ మైక్ దొరికితే.. అక్కడ పవన్ కల్యాణ్ పై విరుచుకుపడటం ప్రారంభించారు. వీరందరి కామన్ పాయింట్ ఒక్కటే… తాము జగన్ కు భయపడటం లేదని చెప్పుకోవడం. జగన్ తమకు అవకాశాలు కల్పిస్తున్నారని.. వివరించుకోవడం. పవన్ కల్యాణ్‌పై.. కుల సమీకరణాలు చూసుకుని వైసీపీ పెద్దలు.. కేవలం కాపు నేతలతోనే విమర్శలు చేయిస్తున్నారు.
కాపు రిజర్వేషన్లు తీసేసిన కాపు నేతలు మాట్లాడటం లేదని… పవన్ కల్యాణ్ చేసిన విమర్శలకు.. ఒక్కరంటే.. ఒక్క నేత కూడా కౌంటర్ ఇవ్వలేదు. కాపు రిజర్వేషన్ల విషయంలో కాపులకు.. జగన్ చేసిన అన్యాయం గురించే పవన్ కల్యాణ్ మాట్లాడారు. కానీ ఆ విషయం గురించి కాకుండా.. మిగతా అన్ని విషయాలను… వైసీపీ కాపు నేతలు మాట్లాడటం ప్రారంభించారు. ఎదురుదాడి చేసి.. విమర్శించడం.. పెయిడ్ ఆర్టిస్టని విమర్శించడం… అంతగా కాకపోతే.. టీడీపీ స్క్రిప్ట్ చదవుతున్నారని విమర్శించడం తప్ప… తమ వర్గ ప్రయోజనాల కోసం.. తాము పోరాడలేకపోతున్నామని.. అధికార పార్టీలో ఉండి.. తాము… తమ సామాజికవర్గం కోసం… ఒక్క మాట మాట్లాడలేకపోతున్నామని..వారు అంగీకరించలేకపోతున్నారు.
టీడీపీ హయాంలో.. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారి పది శాతం కోటాలో.. చంద్రబాబు ఐదు శాతం కల్పించారు. వాటిని కొనసాగించడానికి ఎలాంటి ఆటంకాలు లేకపోయినా… కోర్టుల్లో ఎలాంటి కేసులు లేకపోయినా… ఆ కోటాను రద్దు చేస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. అయినా.. ఒక్కరంటే.. ఒక్క కాపు నేత కూడా.. నోరు మెదపలేదు. కొంత మంది వైసీపీ కాపునేతలయితే.. తమకు రిజర్వేషన్లు అక్కర్లేదన్నట్లుగా మాట్లాడారు. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు.. కాపు సామాజికవర్గంలోనూ… చర్చనీయాంశం అయ్యాయి. అందుకే.. వైసీపీ కాపు నేతలు ఆందోళన చెంది… పవన్ పై ఎదురుదాడి ప్రారంభించారని భావిస్తున్నారు. కానీ అసలు విషయానికి మాత్రం సమాధానం చెప్పరు.