మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఇక లేరు. ఆయన బసవతారకం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుముశారు. కోడెల శివప్రసాదరావు కొద్ది రోజుల కిందట తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గుండెపోటు రావడంతో.. ఆయనను.. గుంటూరు ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అప్పట్నుంచి ఆయన బయటకు రాలేదు. ఆ తర్వాత ఆయన హఠాత్తుగా హైదరాబాద్ ఆస్పత్రిలో చేరినట్లుగా మీడియాకు తెలిసింది. కాసేపటికే.. ఆయన ఇక లేరని.. ఆస్పత్రి వర్గాలు ప్రకటించాయి. దీంతో.. రాజకీయవర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి.
గుండెపోటుతో చనిపోయారా..?
ఏపీలో ప్రభుత్వం మారినప్పటి నుండి.. తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొంటున్న నేతల్లో.. కోడెల శివప్రసాదరావు మొదటి వ్యక్తి. ఆయనపైన.. ఆయన కుటుంబంపైన.. ఇప్పటికి పదుల సంఖ్యలో కేసులు పెట్టారు. ఆయన వ్యాపార సంస్థలపై … దాడులు చేశారు. సీజ్ చేశారు. చివరికి అసెంబ్లీ ఫర్నీచర్ విషయంలోనూ… కోడెలపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. అయితే..ఏ విషయంలోనూ ఆయనపై ఆధారాలు లేవని.. కేవలం దుష్ప్రచారం మాత్రమే చేస్తున్నారని కోడెల వర్గీయులు ఆరోపిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో కోడెల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లుగా కుటుంబసభ్యులు చెబుతున్నారు. మరో సారి తీవ్రమైన గుండెపోటు వచ్చిందని.. ఆ కారణంగానే ఆయన చనిపోయారని చెబుతున్నారు.
ఆత్మహత్య చేసుకున్నారా..?
అయితే.. కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారనే వాదన బలంగా వినిపిస్తోంది. కేసుల పేరుతో..ఆయనను తీవ్ర వేధింపులకు గురి చేశారు. ఆయన కుమార్తె, కుమారుడ్ని వదిలి పెట్టకుండా.. కే్సులు నమోదు చేశారు. దారినపోయే దానయ్యలు వచ్చి ఫిర్యాదు చేసినా… కేసులు నమోదు చేశారు. ప్రాధమిక ఆధారాలు కూడా లేకుండా.. కేసులు నమోదు చేసి వేధించారు. ఈ క్రమంలో… ఆయన… తీవ్ర ఒత్తిడికి గురయ్యారని చెబుతున్నారు. కోడెలపై పదే పదే ఆరోపణలు చేస్తూండటం… ఆయన అనుచరులపై.. అదే పనిగా.. ఒత్తిడి తెస్తూ… గ్రామాల నుంచి పారిపోయేలా చేస్తూండటంతో… కోడెల నిస్సయంగా ఉండిపోయారు. ఈ క్రమంలోనే.. ప్రభుత్వ వేధింపుల కారణంగానే… ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని కోడెల అనుచరులు మండిపడుతున్నారు.
రాజకీయ ఫ్యాక్షన్ వేధింపులే బలి తీసుకున్నాయా..?
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. కోడెల స్థాయి నేతల నుంచి కింది స్థాయి టీడీపీ కార్యకర్తల వరకూ.. ప్రతీ ఒక్కరిని ప్రభుత్వం వెంటాడుతోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. స్పీకర్ గా ఉన్న కోడెల వ్యవహారంలో.. ప్రభుత్వ మరీ దారుణంగా వ్యవహరించింది. ఫర్నీచర్ విషయంలో.. ఆయన పరువు తీసేలా వ్యవహరించింది. అదేదో దొంగతనం చేసినట్లుగా ప్రభుత్వం, జగన్ మీడియా ప్రచారం చేసింది. ఈ వేధింపుల కారణంగానే ఆయన తీవ్రంగా ఒత్తిడికి గురయ్యారని… చెబుతున్నారు.