ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతోందంటే.. ఒక్కటే మాట చెప్పుకోవాలి… అదే వేట.. వేట జరుగుతోంది. అధికారంలోకి వచ్చిన వారు ఇష్టం లేని వారిని వేటాడుతున్నారు. ఆ వేట ఫ్యాక్షన్ తరహాలో సాగుతోంది. రాజకీయ నేతలు.. మీడియా… అనే తేడా లేకుండా.. ఒక్క సామాజికవర్గాన్నే లక్ష్యంగా చేసుకుని ఈ వేట సాగుతోంది. ప్రజాస్వామ్య దేశంలో… ఇది ఊహించలేనిదే కానీ.. అదే జరుగుతోంది.
అధికారం అండతో పొలిటికల్ ఫ్యాక్షన్..!
వేటకత్తులతో నరుక్కోవడమే ఫ్యాక్షనిజం అని.. సినిమాలు ప్రజలకు సందేశం ఇచ్చాయి. కానీ…ఫ్యాక్షనిజం అంటే.. లొంగదీసుకోవడం. తమకు ఎదురు తిరిగేవాళ్లు లేకుండా చేసుకోవడం. తర్వాత ఇష్టం వచ్చినట్లుగా చేయడం కూడా ఫ్యాక్షనిజమే. రాయలసీమలో ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లో అదే జరిగేది. ప్రత్యర్థులు ఎవరైనా మాట వినకపోతే… ముందుగా హెచ్చరించేవారు. అప్పటికీ మాట వినకపోతే.. ఆర్థిక మూలాలను దెబ్బతీస్తారు. అందుకే.. ఎక్కువగా.. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లో… పండ్ల తోటలను నరకడం… బోర్లను కోసేయడం…ట్రాక్టర్లను తగులబెట్టడం వంటి ఘటనలు జరుగుతూ ఉంటాయి. అప్పటికీ లొంగకపోతే.. తర్వాత స్టెప్ వేస్తారు. ఇప్పుడు ఏపీ మొత్తం రాజకీయ ప్రత్యర్థులను లొంగ దీసుకోవడానికి… అదే చేస్తున్నారు. కేసులతో వేధించి.. కోడెల శివప్రసాదరావు లాంటి నేతలను.. సైతం ఆత్మహత్యకు పురికొల్పేలా… అత్యంత దారుణమైన పరిస్థితులు ఏపీలో ఉన్నాయి.
మీడియా గొంతు నొక్కడం అందులో ఎక్స్ట్రీమ్..!
అధికారం కూడా ఉండటంతో.. మొదటగా టీడీపీ నేతలను.. కేసులతో భయపెడుతున్నారు. వినకపోతే… ఆర్థికంగా దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్నారంటున్నారు. దాని ఫలితమే…కొంత మంది రక్షణ కోసమే బీజేపీలో చేరుతున్నారు.ని.. కార్యకర్తల స్థాయిలో వందల మంది గ్రామాలను వదిలి వెళ్తున్నారు. ఇప్పుడు.. తమకు అనుకూలంగా లేని మీడియాపైనా అదే తరహా ఫ్యాక్షనిజాన్ని ప్రదర్శిస్తున్నారని… వీడియో సాక్ష్యాలతో సహా రుజువైంది. ఏబీఎన్ ఏపీలో రాకూడదని జగన్ ఆదేశించడంతో.. కేబుల్ ఆపరేటర్లను తమ కార్యాలయానికే పిలిపించి.. ఇద్దరు మంత్రులు బెదిరించిన వైనం చర్చనీయాంశమవుతోంది. మాట వినకపోతే ఆర్థిక మూలాలు దెబ్బతీస్తామని మంత్రులు హెచ్చరించినట్లుగా ప్రచారం జరుగుతోంది. లొంగకపోతే… అదే జరుగుతుందని.. ఇప్పటి వరకూ జరిగిన పరిణామాలను బట్టి భయపడి వారు.. చానళ్లను ఆపేశారంటున్నారు.
ప్రజాస్వామ్యంలో ఫ్యాక్షన్ మనగలుగుతుందా..?
ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు… అప్రజాస్వామికంగా ఉన్న తీరు.. జాతీయ మీడియాను సైతం నివ్వెర పరుస్తోంది ఆంధ్రప్రదేశ్ లో అత్యంత ఘోరమైన పరిస్థితులు ఉన్నాయని… ఏపీలో ఏం జరుగుతోందో… కాస్త నిదానంగా ఆలోచించిన వారికి అర్థమవుతోంది. అధికారం ఉందని.. నిబంధనలకు విరుద్ధంగా పాలన సాగుతోంది. నియమ నిబంధనలకు వ్యతిరేకంగా చేయాల్సినవన్నీ చేస్తున్నారు. దానికి పారదర్శకత ముద్ర వేస్తున్నారు. పాలన చేస్తున్న రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు. ఫ్యాక్షనిజంతో ఎవరి గొంతూ లేవకుండా చేస్తున్నారు. పాలనలోనూ ఫ్యాక్షన్ చూపిస్తున్నారు.