ఎన్నికలకు ముందు ఐటీ గ్రిడ్ పేరుతో… టీడీపీ యాప్, వెబ్ సైట్‌ను టార్గెట్ చేసి.. ప్రజల వ్యక్తిగత సమాచారం… చోరీ చేశారంటూ… హడావుడి చేసిన కేసుల్లో.. తెర ముందు వైసీపీ పెట్టిన వ్యక్తి పేరు తుమ్మల లోకేశ్వర్ రెడ్డి. ఐటీ నిపుణుడిగా.. వైసీపీ ప్రచారం చేసుకుని.. విజిల్ బ్లోయర్ గా… కేటీఆర్ సర్టిఫికెట్ ఇచ్చిన ఆ వ్యక్తికి.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం కీలక పదవి దక్కింది. నేరుగా ముఖ్యమంత్రికి సలహాదారుగా నియమితులయ్యారు. సలహాదారులందరికీ.. నెలకు రూ. 3లక్షలకుపైగా జీతభత్యాలు ఉన్నందున ఈయనకు కూడా.. అలాగే… ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. అదనంగా సిబ్బంది, కార్లు, క్వార్టర్లు, పింగాళి గ్లాసులు ఇతర వస్తువులు కొనుగోలుకు… నిధులు ఇస్తారు.
నిజానికి ఐటీ గ్రిడ్ అనే కంపెనీని టార్గెట్ చేయడానికి కర్త, కర్మ, క్రియ విజయసాయిరెడ్డి. ఆయన తన స్కెచ్‌ను.. ఈసీ వద్ద పొరపాటున.. రిజిస్టర్ చేసి.. దొరికిపోయారు. విజయసాయి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జనవరి 23వ తేదీన ఐటీ గ్రిడ్ సంస్థలో సోదాలు చేశారు. కానీ కేసు అధికారికంగా నమోదు చేయలేదు. తర్వాత అసలు విషయం బయటపడటంతో.. వైసీపీ నేత లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేశారంటూ.. హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. లోకేశ్వర్ రెడ్డి.. జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు. ఆయన ఏ ఐటీ కంపెనీల్లో పని చేశారో ఎవరికీ తెలియదు కానీ.. డేటా నిపుణుడిగా చెప్పుకుని… ఆయన ఫిర్యాదుపై కేసులు పెట్టారు. దాని కేంద్రంగా టీడీపీపై బురద చల్లారు. ఇప్పుడు.. వైసీపీ అధికారంలోకి వచ్చినా.. ఆ కేసులో కదలిక లేదు.
ఈ తుమ్మల లోకేశ్వర్ రెడ్డికి ఇప్పుడు.. ఉద్యోగం కల్పించారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే వివిధ రంగాల్లో సలహాదారుల పేరుతో పదుల సంఖ్యలో … నియామకాలు జరిపిన సర్కార్.. కొత్తగా… టెక్నికల్ సలహాదారుగా.. లోకేశ్వర్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జగన్మోహన్ రెడ్డి సలహాదారులందరూ.. అయితే… బంధువులు.. లేకపోతే సాక్షి ఉద్యోగులు. లోకేశ్వర్ రెడ్డి నియామకంతో.. మరోసారి ఆ విషయం స్పష్టమయిందనే విమర్శలు వస్తున్నాయి.